Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో ఆయన సినీ, రాజకీయాలకి సంబంధించి ఆసక్తికర ప్రశ్నలు సంధించాయి బాలయ్య .అయితే చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని చెప్పిన పవన్… అనారోగ్య పరిస్థితుల కారణంగా స్నేహితులతో కలవలేక పోయేవాడిని.. స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేవాడిని. దాంతో 17 ఏళ్ల వయసులో మానసికంగా కృంగి పోయి చనిపోవాలనుకున్నాను. ఓ సారి అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకొని కాల్చుకుందాం అనుకున్నాను.
అప్పుడే వదిన సురేఖ నన్ను గమనించారు. ఎందుకలా ఉన్నావ్ అంటూ ప్రశ్నించడంతో చనిపోవాలనిపిస్తుందని చెప్పాను. దాంతో అన్నయ్య వద్దకు వదిన తీసుకు వెళ్లారు. అప్పుడు అన్నయ్య పరీక్షలపై గురించిన ఆలోచన అక్కర్లేదు బతికి ఉండరా అని అన్నాడు. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే తత్వాన్ని అన్నయ్య నుండి నేర్చుకున్నాను. రాజకీయాల్లో విమర్శలు కచ్చితంగా స్వీకరించాల్సిందే ఎన్ని విమర్శలు అయినా భరించాల్సిందే. దాన్ని కూడా నేను అన్నయ్య నుండి నేర్చుకున్నాను అని పవన్ తెలిపారు. సినీ పరిశ్రమలో పేరు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి ప్రవేశించి అంతటి నమ్మకం పొందాలంటే కాస్త సమయం పడుతుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోను. అందుకే కచ్చితంగా భవిష్యత్తులో జనాలు మార్పు కోరుకుంటారని అన్నారు పవన్ కళ్యాణ్.
విశాఖపట్నంలో జరిగిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నేను ఒక అడుగు వేసినా మాట్లాడాలనుకున్నా ప్రభుత్వంలో ఉండే వారికి ఇబ్బందిగా ఉంటుంది. నేను మామూలుగా చేసిన దాన్ని ఏదోలా చేస్తున్నారు.. నేను వైజాగ్ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు చేశారు. ఓ మహిళపై అక్రమంగా కేసు పెట్టారు.. ఆధిపత్య ధోరణి కి అది నిదర్శనం. నేను నోరు ఎత్తితే మూసి వేసేందుకు అని ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. ఆ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మంచి నీటిని అందించాలని ప్రయత్నించాను. అందుకోసం కొంత మందిని సంప్రదించాను. కానీ అక్కడ రాజకీయ గ్రూప్స్ అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయి అని అప్పుడే తెలిసింది. ఎన్జీవో తో సరిపోదు ఏదోచేయాలనే ఆలోచనతో పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాను అని పవన్ అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…