Partner OTT Release Date : థియేట‌ర్ల‌లో రిలీజ్ కాకుండానే.. ఓటీటీలోకి హన్సిక పార్ట్‌న‌ర్ మూవీ..!

October 7, 2023 7:42 AM

Partner OTT Release Date : పార్ట్‌న‌ర్ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేస్తోంది. ఇందులో ఆదిపినిశెట్టి, హ‌న్సిక జంట‌గా నటించారు. ఇక ఈ మూవీ కి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం. అలానే, ఓటీటీ లో ఎప్పుడో రాబోతోంది..?, ఎందులో స్ట్రీమింగ్ అవ్వనుంది అనేది కూడా చూసేద్దాం. పార్ట్‌న‌ర్ మూవీ డైరెక్ట్ ఓటీటీ లోకి రాబోతోంది. థియేట‌ర్ల‌లో రిలీజ్‌కాకుండానే డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీ లోకి వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ 6 నుంచి సింప్లీసౌత్ ఓటీటీ లో ఇది స్ట్రీమింగ్ కి సిద్ధం గా వుంది.

సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ మూవీ ఇది. కేవ‌లం ఓవ‌ర్‌ సీస్ ఆడియెన్స్‌ కి మాత్ర‌మే ఈ సినిమా అందుబాటు లోకి రాబోతోంది. తెలుగు, త‌మిళ ఆడియెన్స్‌ కి, అమెజాన్ ప్రైమ్ లో త్వ‌ర‌లో రాబోతోంది. ఈ మూవీ, త‌మిళంలో ఆగ‌స్ట్ 25న రిలీజ్ అయింది. తెలుగులోనూ అదే టైటిల్‌తో రిలీజ్ చేయాలనీ ట్రై చేస్తున్నారు.

Partner OTT Release Date know the details
Partner OTT Release Date

ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌ లోకి రాలేదు. ఆ రిలీజ్ కాకుండానే, త‌మిళ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశానికి కామెడీని జోడించి ఈ సినిమా ని తెర మీద కి తీసుకు వచ్చారు డైరెక్ట‌ర్ మ‌నోజ్‌దామోద‌ర‌న్. ఇక నటుల విషయానికి వస్తే, ఆది పినిశెట్టి, హ‌న్సిక‌ తో పాటు యోగిబాబు ఇందులో కీల‌క పాత్ర పోషించారు. ఈ సినిమా పై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకుని, రిలీజ్ చేసారు.

పైగా ట్రైల‌ర్‌, టీజ‌ర్స్‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని కలిగించాయి. కానీ, మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇక కథ విషయానికి వస్తే… ఒక సైంటిస్ట్ త‌యారు చేసిన చిప్‌ ని త‌న స్నేహితుడు క‌ళ్యాణ్‌ (యోగిబాబు)తో క‌లిసి దొంగలించాలని శ్రీధ‌ర్ (ఆది పినిశెట్టి) తో పాటు ప్లాన్ చేస్తాడు. కానీ, ఆ చిప్ వలన క‌ళ్యాణ్ అనుకోకుండా అమ్మాయిగా (హ‌న్సిక‌) గా మారతాడు. నెక్స్ట్ ఏం జరిగింది..?, క‌ళ్యాణ్ తిరిగి అబ్బాయిగా మారాడా..? రౌడీ గ్యాంగ్ ఎందుకు వెంటపడుతుంది..? ఇలా బయట పడతారు..? ఇవన్నీ తెలియాలంటే, సినిమా చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment