Bandla Ganesh : బండ్ల గణేష్.. ఒకప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాడు. విచిత్ర వేషాలతో కూడా ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంటాడు. ఆ మధ్యలో రాజకీయాలకు వెళ్లి మళ్లీ గుడ్ బై అన్నట్టుగా చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఈ సారి కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.అయితే బండ్ల గణేష్ హిందూ ఫెస్టివల్స్‌ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆయనకి దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే పెద్దె ఎత్తున బాణాసంచా తెప్పించారు.
బాణాసంచాని ఊరందరికి పంచిపెట్టి, ఎంతో సంబరంగా అందరితో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు బండ్ల గణేష్ . అయితే, ఆయన ఈ సారి మాలలో ఉండి చెప్పులు ధరించి మరీ క్రాకర్స్ కాల్చారు బండ్లగణేష్. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పడు వైరల్‌గా మారింది. అయ్యప్ప దీక్షలో ఉండి బండ్ల గణేష్ ఇలా కాలికి చెప్పులు వేసుకున్నాడేంటి? అని అందరు షాక్ అవుతున్నారు. అయ్యప్ప మాల చాలా పవిత్రమైనది. దాన్ని ఇలా అపవిత్రం చేయకండి అంటూ కొందరు నెటిజన్లు బండ్లగణేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప మాల ధరించి ఇలాంటి పనులు చేయడం తప్పని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఏదిఏమైనా బండ్లగణేష్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయన కి ఇప్పుడు పవన్‌తో చెడిందని అంటున్నారు. పవన్.. బండ్లని దూరంగా పెట్టిన కూడా ఆయన ఎప్పుడు కూడా పవన్ వైపే నిలుస్తూ ఆయన గురించి గొప్పగా చెప్పుకొస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…