Bandla Ganesh : అయ్య‌ప్ప మాల‌లో ఉండి బండ్ల గ‌ణేష్ అలా చేశాడేంటి.. తిట్టి పోస్తున్న నెటిజ‌న్స్

November 14, 2023 8:24 PM

Bandla Ganesh : బండ్ల గ‌ణేష్‌.. ఒక‌ప్పుడు నిర్మాత‌గా వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. విచిత్ర వేషాల‌తో కూడా ఎక్కువ‌గా హాట్ టాపిక్ అవుతుంటాడు. ఆ మధ్యలో రాజకీయాలకు వెళ్లి మ‌ళ్లీ గుడ్ బై అన్నట్టుగా చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఈ సారి కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.అయితే బండ్ల గ‌ణేష్ హిందూ ఫెస్టివ‌ల్స్‌ని ఘనంగా సెల‌బ్రేట్ చేసుకుంటాడు. ఆయ‌న‌కి దీపావ‌ళి పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్ర‌తి ఏటా ఈ పండుగ‌ను ఎంతో వైభవంగా జ‌రుపుకుంటారు. అందులో భాగంగానే పెద్దె ఎత్తున బాణాసంచా తెప్పించారు.

బాణాసంచాని ఊరంద‌రికి పంచిపెట్టి, ఎంతో సంబ‌రంగా అంద‌రితో క‌లిసి ఈ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు బండ్ల గ‌ణేష్ . అయితే, ఆయ‌న ఈ సారి మాల‌లో ఉండి చెప్పులు ధ‌రించి మ‌రీ క్రాక‌ర్స్ కాల్చారు బండ్ల‌గ‌ణేష్‌. దీనికి సంబంధించిన ఫోటో ఒక‌టి ఇప్ప‌డు వైర‌ల్‌గా మారింది. అయ్యప్ప దీక్షలో ఉండి బండ్ల గణేష్ ఇలా కాలికి చెప్పులు వేసుకున్నాడేంటి? అని అంద‌రు షాక్ అవుతున్నారు. అయ్య‌ప్ప మాల చాలా ప‌విత్రమైన‌ది. దాన్ని ఇలా అప‌విత్రం చేయ‌కండి అంటూ కొంద‌రు నెటిజ‌న్లు బండ్ల‌గ‌ణేష్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయ్య‌ప్ప మాల ధ‌రించి ఇలాంటి ప‌నులు చేయ‌డం త‌ప్ప‌ని మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

netizen very angry about what bandla ganesh did
Bandla Ganesh

ఏదిఏమైనా బండ్ల‌గ‌ణేష్ మ‌రోసారి నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఈ విష‌యంపై ఆయ‌న ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. బండ్ల గ‌ణేష్‌.. ప‌వన్ క‌ళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయ‌న కి ఇప్పుడు ప‌వ‌న్‌తో చెడింద‌ని అంటున్నారు. ప‌వ‌న్‌.. బండ్ల‌ని దూరంగా పెట్టిన కూడా ఆయ‌న ఎప్పుడు కూడా ప‌వ‌న్ వైపే నిలుస్తూ ఆయ‌న గురించి గొప్ప‌గా చెప్పుకొస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now