Nandamuri Ramakrishna : నంద‌మూరి ఫ్యామిలీకి ఏమైంది.. కారు యాక్సిడెంట్‌కి గురైన బాల‌కృష్ణ సోద‌రుడు..

February 11, 2023 2:23 PM

Nandamuri Ramakrishna : ఇటీవ‌ల నంద‌మూరి ఫ్యామిలీలో వ‌రుస విషాద సంఘ‌ట‌నలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి వారి కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్నాయి. హ‌రికృష్ణ‌, జాన‌కిరామ్‌ల మ‌ర‌ణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నంద‌మూరి ఫ్యామిలీకి ఇటీవ‌ల తార‌క‌ర‌త్న ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం కోలుకోలేని షాకిచ్చింది. నారా లోకేష్ పాదయాత్ర యువగళం ప్రారంభిస్తున్న రోజు కుప్పంలో పాదయాత్రలో పాల్గొన్నారు తార‌క‌ర‌త్న‌. అయితే అదే రోజు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుప్పం పాదయాత్రలోనే కుప్పకూలిపోయారు.

వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లినా, దానికి సుమారు 45 నిమిషాలు పట్టింది. ఆ 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోయింది అని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో రక్త ప్రసరణ ఆగిపోవడంతో ఆయన ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని చెబుతున్నారు. గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించిందని అప్పటినుంచి ఆయనను మామూలు మనిషిని చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయన నారాయణ హృదయాలయ అనే హాస్పిటల్లో గుండెకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదని పైభాగం కొంతమేర దెబ్బతిందని దానిని స‌రిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Nandamuri Ramakrishna got in accident what is happening
Nandamuri Ramakrishna

తార‌క‌ర‌త్న ఆరోగ్యం గురించి అంద‌రు ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో బాలకృష్ణకు సోదరుడు అయిన నందమూరి రామకృష్ణ కారుకు హైదరాబాద్ లో యాక్సిడెంట్ జరిగింది. శుక్రవారం ఉదయం కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ప్ర‌యాణిస్తుండ‌గా, ఆయ‌న కారు అదుపుతప్పి రోడ్ డివైడర్ ని ఢీ కొంది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారుని పక్కనే నిలిపి అక్కడి నుంచి రామకృష్ణ వెళ్లిపోయారు. కారులో ఆయన ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు.. ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. కాగా, తారకరత్నని ఇటీవలే పరామర్శించి వచ్చారు రామకృష్ణ.ఆయ‌నకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోయే స‌రికి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment