Naga Chaitanya : అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం మాత్రం వైవిధ్యమైన సినిమాలతో రాణిస్తున్నాడు. రీసెంట్‌గా ధూత అనే సినిమాతో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న ఈయన తాజాగా యూట్యూబర్ గా మారాడు. అసలు సోషల్ మీడియా అంటేనే నచ్చని ఈయన… ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నప్పటికీ చై ఎక్కువగాపెద్దగా వాడిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఓసారి తన సినిమాల గురించి మాత్రమే వాటి ద్వారా అప్ డేట్లు ఇస్తుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే నాగ చైతన్య యూట్యూబ్ ఛానెల్ వాడడం నిర్ణయం వెనుక గల కారణాలు ఏంటీ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అక్కినేని నాగచైతన్య పేరుతో ఛానల్‌ను రూపొందించిన నాగ చైతన్య.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. ఇక ఈ యూట్యూబ్‌లో నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించాడు చైతూ. ఇదంతా చూస్తుంటే ఆయన కేవలం తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు రీజన్ ఏంటని అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేగు, ఇంట్లో ఖాళీగా ఉన్నా, పనేంలేక జుట్టు, గడ్డం పెంచానంటూ కామెడీ చేశాడు చై.
నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న NC23 సినిమా రూపొందుతన్న విషయం తెలిసిదే. ఈ చిత్రం కోసమే జుట్టు, గడ్డం పెంచినట్లు ఆ తర్వాత చెప్పారు. అలాగే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్ జరగ్గగా… రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి చై పక్కన హీరోయిన్ గా నటించబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను మొదటి సారిగా చేసిన దూత వెబ్ సిరీస్ గురించి కూడా పలు ఆసక్తికర అంశాలను చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న చైతన్య ఈ సారి మాత్రం మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…