Naga Chaitanya Dhootha OTT Release Date : అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య స్లో అండ్ స్టడీగా దూసుకుపోతున్నాడు. హీరోగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని పలకరించిన నాగ చైతన్య డిజిటల్ ప్లాట్‌ఫాంలో అరంగేట్రం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తనతో రెండు సినిమాలకు పనిచేసిన దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందిస్తోన్న మొట్టమొదటి తెలుగు సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్‌పై చైతూ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం చైతూ రేసులో వెనుకబడి పోయాడు.ఈయన కంటే కుర్ర హీరోలు కూడా హిట్స్ కొడుతూ పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు. చైతన్య మాత్రం వరుస ప్లాప్స్ అందుకుంటూ సతమతం అవుతున్నాడు.
ఈ సమయంలో దూత అనే వెబ్ సిరీస్‌తో అందరి మనసులు కొల్లగొట్టాలని నాగ చైతన్య భావిస్తున్నాడు. నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబోలోనే ”దూత” అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ ప్రాజెక్ట్ థాంక్యూ ప్లాప్ కారణంగా ఇప్పటి వరకు రిలీజ్ కు రెడీ కాలేక పోయింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ కు డేట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుండగా, మొత్తం 8 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ రానుందట. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ వెబ్ సిరీస్‌కి కేటాయించినట్టు సమాచారం.
దూత హర్రర్ సిరీస్ తప్పకుండా ఆడియన్స్‌ను థ్రిల్ చేయడంతో పాటుప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. మనం, థాంక్యూ వంటి సినిమాల తర్వాత ఈ కాంబో ఇప్పుడు దూతతో రాబోతుండగా, మరి ఇది హిట్ అందుకుంటుందో ప్లాప్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.. పార్వతీ, ప్రియా భవాని శంకర్ కీలక రోల్స్ పోషించారు. గత ఏడాది మేలో షూటింగ్ ప్రారంభం కాగా, ఆగస్టులో షూటింగ్ పూర్తయ్యింది. అయితే, అప్పటి నుంచీ అమెజాన్ ఈ సిరీస్‌ను పెండింగ్ పెడుతూ వచ్చింది. చైతూకి మంచి క్రేజ్ పెరిగాక రిలీజ్ చేయాలని కాస్త వాయిదాలు వేస్తూ వచ్చింది. ఇప్పుడు సరైన సమయం అని భావిస్తున్న మేకర్స్ డిసెంబర్‌లో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…