Naga Chaitanya Dhootha OTT Release Date : నాగ చైత‌న్య వెబ్ సిరీస్ దూత వ‌చ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే..?

నవంబర్ 14, 2023 7:39 సా.

Naga Chaitanya Dhootha OTT Release Date : అక్కినేని నాగార్జున త‌న‌యుడు నాగ చైత‌న్య స్లో అండ్ స్ట‌డీగా దూసుకుపోతున్నాడు. హీరోగా వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నాగ చైత‌న్య డిజిటల్ ప్లాట్‌ఫాంలో అరంగేట్రం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తనతో రెండు సినిమాలకు పనిచేసిన దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందిస్తోన్న మొట్టమొదటి తెలుగు సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్‌పై చైతూ భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం చైతూ రేసులో వెనుకబడి పోయాడు.ఈయన కంటే కుర్ర హీరోలు కూడా హిట్స్ కొడుతూ పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు. చైతన్య మాత్రం వరుస ప్లాప్స్ అందుకుంటూ స‌త‌మ‌తం అవుతున్నాడు.

ఈ స‌మ‌యంలో దూత అనే వెబ్ సిరీస్‌తో అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టాల‌ని నాగ చైత‌న్య భావిస్తున్నాడు. నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబోలోనే ”దూత” అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ ప్రాజెక్ట్ థాంక్యూ ప్లాప్ కారణంగా ఇప్పటి వరకు రిలీజ్ కు రెడీ కాలేక పోయింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ కు డేట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుండ‌గా, మొత్తం 8 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ రానుందట. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్ వెబ్ సిరీస్‌కి కేటాయించిన‌ట్టు స‌మాచారం.

Naga Chaitanya Dhootha OTT Release Date
Naga Chaitanya Dhootha OTT Release Date

దూత హర్రర్ సిరీస్ తప్పకుండా ఆడియన్స్​ను థ్రిల్ చేయడంతో పాటుప్రేక్ష‌కులకి కొత్త అనుభూతిని ఇస్తుంద‌ని అంటున్నారు. మనం, థాంక్యూ వంటి సినిమాల తర్వాత ఈ కాంబో ఇప్పుడు దూత‌తో రాబోతుండ‌గా, మ‌రి ఇది హిట్ అందుకుంటుందో ప్లాప్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.. పార్వతీ, ప్రియా భవాని శంకర్ కీలక రోల్స్ పోషించారు. గ‌త ఏడాది మేలో షూటింగ్ ప్రారంభం కాగా, ఆగస్టులో షూటింగ్ పూర్తయ్యింది. అయితే, అప్పటి నుంచీ అమెజాన్ ఈ సిరీస్‌ను పెండింగ్ పెడుతూ వచ్చింది. చైతూకి మంచి క్రేజ్ పెరిగాక రిలీజ్ చేయాల‌ని కాస్త వాయిదాలు వేస్తూ వ‌చ్చింది. ఇప్పుడు స‌రైన స‌మ‌యం అని భావిస్తున్న మేక‌ర్స్ డిసెంబర్‌లో రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now