Mangalavaram Day 1 Collections : తొలి రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ చేసిన మంగ‌ళ‌వారం మూవీ..!

November 18, 2023 9:14 PM

Mangalavaram Day 1 Collections : ఆర్ఎక్స్ 100 మూవీ హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన చిత్రం మంగ‌ళ‌వారం. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన రిలీజ్ కాగా, మొద‌టి నుండి ఈ చిత్రంపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇదే. హైపర్ సెక్సువల్ డిజార్డర్ అనే టిపికల్ పాయింట్‌తో ఫన్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన మంగళవారం సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం వంద రోజుల పాటు ఔట్ డోర్ షూటింగ్, యాక్టర్ల పారితోషికాలతో కలిపి మొత్తంగా ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లకుపైగానే అయిన‌ట్టు తెలుస్తుంది. కథ డిమాండ్ చేయడం, క్వాలిటీ కోసం రాజీ పడకూడదనే ఉద్దేశంతో నిర్మాత‌లు ఈ చిత్రానికి భారీగానే ఖ‌ర్చు పెట్టారు. పల్లెటూరి నేపథ్యంతో భయపెట్టే కథతో రూపొందిన మంగళవారం సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.ఈ సినిమాకి సుమారుగా 27 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ రిపోర్టు. డిమాండ్‌కు తగినట్టుగా నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేయగా.. ఆంధ్రాలో పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీగా చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకొన్నారు.

Mangalavaram Day 1 Collections know what is how much
Mangalavaram Day 1 Collections

తొలి రోజు ఈ చిత్రం భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. నైజాం ఏరియాలో ఈ సినిమా కోటి వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తుండ‌గా, శ‌నివారం రోజు కూడా దాదాపు రెండు కోట్ల వ‌ర‌కు ఈ మూవీ షేర్‌క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి మంగ‌ళ‌వారం చిత్రం తొలిరోజే దాదాపు రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డంతో ఫ‌స్ట్ వీక్‌లోనే మంగ‌ళ‌వారం లాభాల్లోకి అడుగుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ విశ్లేష‌కులు చెప్పుకొస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now