Krishna Eenadu Movie : సామాజిక, రాజకీయ అంశాలపై సినిమాలను తీయడంలో కృష్ణ తనకు తానే సాటి అనిపించుకున్నారు. అప్పట్లో ఈ జోనర్‌లలో ఆయన తీసిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఇలాంటి మూవీల్లో హీరోయిజం చూపించే ఫైట్స్, పాటలు ఉండవు. అయితే ఇదే జోనర్ లో అప్పట్లో వచ్చిన చిత్రం ఈనాడు. ఇది సూపర్ స్టార్ కృష్ణకు 200వ సినిమా. ఈ మూవీ అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. విప్లవ, అభ్యుదయ భావాల మేళవింపుతో ఈ మూవీని తెరకెక్కించారు. రాజకీయ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మూవీలో కృష్ణ నటన హైలైట్ అని చెప్పవచ్చు. ఈ మూవీ కృష్ణ కెరీర్‌లో ఒక బెస్ట్ చిత్రంగా నిలిచింది.
ఇక ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథలో చాలా మార్పులు చేసి మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్స్ ఉండవు. ఇలాంటి సినిమాను ఎంచుకోవడం కృష్ణ గట్స్ కి నిదర్శనం అని చెప్పవచ్చు. తనకు ఎంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు పేరే ఇందులో రామరాజుగా పెట్టుకున్నారు. 1982 జూన్ 9న చెన్నైలో షూటింగ్ స్టార్ట్ అయింది. అక్కడే షూటింగ్ ఎక్కువగా జరిగింది. అలాగే గుంటూరు, తెనాలిలో కూడా షూటింగ్ చేశారు. క్లైమాక్స్ విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర 2 రోజుల పాటు చేశారు. రూ.30 లక్షలతో 35 రోజుల్లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.
1982 డిసెంబర్ 17న ఈనాడు మూవీ రిలీజ్ అయింది. అప్పటికే కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థపై తీసిన సీన్స్ బాగా పండాయి. క్లైమాక్స్ లో కృష్ణ చెప్పే డైలాగ్స్, మరణించడం సీన్స్ సూటిగా గుండెల్ని తాకుతాయి. సాంబశివరావు డైరెక్షన్ తీరు, రాఘవులు సంగీతం ఈనాడుకు ప్రాణం పోశాయి. టైటిల్ సాంగ్, రండి కదిలి రండి సాంగ్ అదిరిపోయాయి. ఇక అప్పుడే ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, కృష్ణ సాంగ్ లో సైకిలు తొక్కడం, తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావడం యాదృచ్ఛికంగానే జరిగాయి. తెలుగుదేశం విజయం సాధించాక కృష్ణ అభినందిస్తూ పేపర్ ప్రకటన ఇచ్చారు. అప్పటికి ఈనాడు 100 రోజులు కూడా పూర్తయింది. టోటల్ రూ.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కృష్ణ మాస్ ఫాలోయింగ్ వలన ఇలా కలెక్షన్స్ వచ్చాయి. ఇలా ఈ మూవీ అప్పట్లోనే ఒక సంచలనంగా నిలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…