ఆరోగ్యం

Red Guavas : ఎరుపు రంగు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Red Guavas : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. జామ‌కాయ‌లు కాస్త ప‌చ్చిగా, దోర‌గా ఉన్న‌ప్పుడే టేస్ట్ బాగుంటాయి. కానీ కొంద‌రు పండ్ల‌ను మాత్ర‌మే తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే.. జామ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అయితే జామ‌కాయ‌ల్లో మ‌న‌కు రెండు ర‌కాల కాయ‌లు ల‌భిస్తాయి. లోప‌లి గుజ్జు తెల్ల‌గా ఉండేవి ఒక ర‌కం అయితే.. ఎర్ర‌గా ఉండేవి ఒక ర‌కం. ఈ ఎర్ర‌గా ఉండే కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జామ‌కాయ‌ల్లో బీటా కెరోటీన్ మోతాదు ఎక్కువైతే అవి ఎర్ర‌గా ఉంటాయి. అయితే ఈ బీటా కెరోటీన్ మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. కంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. క‌నుక ఎరుపు రంగులో ఉండే జామ‌కాయ‌ల‌ను తింటే కంటికి మేలు చేస్తుంద‌న్న‌మాట‌. ఇక ఈ కాయ‌ల్లో విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. బ‌రువును త‌గ్గిస్తుంది. చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధుల‌ను రాకుండా చూస్తుంది.

Red Guavas

ఎర్ర జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఫైబ‌ర్ అధికంగా ల‌భిస్తుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం వంటివి ఉండ‌వు. ఈ కాయ‌ల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తింటే చేతులు, కాళ్ల‌లో వ‌చ్చే తిమ్మిర్లు త‌గ్గుతాయి. పొటాషియం సమృద్దిగా ఉండ‌డం వ‌ల్ల ఈ కాయ‌ల‌ను తింటే రక్త ప్రవాహం బాగా జ‌రిగేలా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు. ఇక ఈ కాయ‌ల‌ను తింటే అలసట, నీరసం తగ్గి చురుకుగా ఉంటారు. బి కాంప్లెక్స్‌ విటమిన్స్ ఉండ‌డం వల్ల‌ రక్తకణాల వృద్ధికి సహాయపడుతుంది. దీంతో ర‌క్తం అధికంగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇలా ఎర్ర రంగు జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక ఈసారి ఈ కాయ‌లు క‌న‌బ‌డితే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకుని తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM