కోవై సరళ గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేదు. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు కోవై సరళ ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ సినిమాలో ఓటీటీలో రిలీజైంది. సెంబీ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే అల్లారు ముద్దుగా పెంచుకున్న వీరతల్లి మనవరాలు సెంబీని కొందరు కుర్రాళ్లు దారుణంగా అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత ఆమె కోలుకుందా, న్యాయం జరిగిందా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
సెంబీ సినిమాలో చిన్నారులపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం, దాని ఆవశ్యకత లాంటి విషయాల్ని ఈ మూవీలో ప్రస్తావించారు. పదేళ్ల గిరిజిన పాపపై అత్యాచారం జరిగితే.. న్యాయం చేసే విషయం ఆలోచించకుండా.. పోలీసుల దగ్గర నుంచి పొలిటిషన్స్ వరకు దాన్ని ఎలా రాజకీయం చేస్తారు, తమ పదవులు కాపాడుకునేందుకు సదరు అత్యాచారం, అది జరిగిన మనుషులపై ఎలాంటి పుకార్లు క్రియేట్ చేస్తారనేదాన్ని చాలా చక్కగా చూపించారు. లాయర్లకే కాకుండా ప్రజలకు కూడా చట్టాలు గురించి తెలిస్తే.. తమను తాము ఎలా కాపాడుకోవచ్చనేది ఇందులో చూపించారు.
అయితే హీరోను హైలైట్ చేస్తూ, ఎలివేట్ చేయడంతో స్టోరీ అక్కడక్కడా పక్కదారి పట్టినట్లు అనిపించింది. ఇక వాస్తవాన్ని అంతే వాస్తవంగా చూపించి ఉంటే మాత్రం ఈ మూవీ మరో సామాజిక కథాంశం ఉన్న అద్భుతమైన సినిమా అయి ఉండేది. ఇక చివర్లో క్లైమాక్స్ అయితే ఎందుకో కాస్త కృత్రిమంగా అనిపించింది. కోవై సరళ 60 ఏళ్ల బామ్మగా అది కూడా డీగ్లామర్ రోల్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. సెంబిగా చేసిన బేబీ నిలా మాత్రం రేప్ జరిగిన పాపగా బాగా చేసింది. డైరెక్టర్ ప్రభు సోల్మన్ మంచి పాయింట్ ని స్టోరీగా అనుకున్నప్పటికీ.. దాన్ని ప్రెజెంట్ చేయడంలో అటూ ఇటూ వెళ్లిపోయి ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెట్టేశాడు. ఫైనల్ గా మాత్రం సాటిస్పై చేసేశాడు. చిత్రంతో మంచి ప్రయత్నం అయితే చేశాడు. ఇది ప్రేక్షకులకి బాగానే నచ్చుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…