Keerthy Suresh : రాధికా ఆప్టేతో కీర్తి సురేష్ పోటీ.. ఆమెని మ‌హాన‌టి త‌ట్టుకోగ‌లదా?

November 25, 2023 2:19 PM

Keerthy Suresh : ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో అనేక ప్రాజెక్ట్‌లు రూపొందుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ క్రేజీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోంది. చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోన్న వెర్సటైల్ యాక్టర్స్ కీర్తి సురేష్ రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రల్లో క‌నిపించి అల‌రించ‌నున్నారు. రాధికా ఆప్టే పెర్పార్మెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. స‌న్నివేశం డిమాండ్ చేసిందంటే? ఎంత‌టికైనా సై అంటుంది. న్యూడ్ స‌న్నివేశాల్లో సైతం న‌టించిన అనుభ‌వం ఆమెకి ఉంది.

లిప్ లాక్ లు..బికినీ ..బెడ్ రూమ్ సీన్లు? ఇలా ఏదైన స‌రే ఆమె చాలా రియ‌లిస్టిక్‌గా పండించ‌గ‌ల‌దు. అయితే అలాంటి న‌టితో కీర్తి సురేష్ ఇప్పుడు పోటీ ప‌డాల్సిన స‌న్నివేశం ఎదుర‌వుతుందా? సీన్ డిమాండ్ చేస్తే రాధిక పోటీగా త‌గ్గేదేలే అంటుందా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన తొలి చిత్రం అక్క ప్రాజెక్ట్ కోసం టీమ్ తెలివిగా ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ వైఆర్‌ఎఫ్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టినందుకు కీర్తి చాలా సంతోషంగా ఉంది. పీరియడ్ రివెంజ్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతోంది.

Keerthy Suresh competing with radhika apte in movies
Keerthy Suresh

ఇందులో హీరోయిన్ రెండు పాత్ర‌లు పోటా పోటీగా ఉంటాయ‌ట‌. నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతాయ‌ని ఇన్‌సైడ్ టాక్. రివేంజ్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో కంటెంట్ ప‌రంగానూ బోల్డ్ గా వెళ్లే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన కీర్తి ఇందులో బోల్డ్‌గా క‌నిపించ‌డానికి అంగీక‌రించిందా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ ఆమె పేరు ప్ర‌ధానంగా హైలైట్ అవ్వ‌డంతో రాధికా ఆప్టేతో పోటీ ప‌డి న‌టించ‌గ‌ల‌దా? అన్న‌ది మాత్రం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సిరీస్ మెజార్టీ షూటింగ్ పూర్తయిన తర్వాతే దీని గురించి వివరాలను వెల్లడించాలని మేకర్స్ భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now