Japan OTT Release Date : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న కార్తీ జ‌పాన్ చిత్రం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

December 5, 2023 11:50 AM

Japan OTT Release Date : ఇప్పుడు త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల‌కి చెందిన హీరోల‌ని కూడా మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఓన్ చేసుకుంటున్నారు. వారి సినిమాల‌ని ఎంత‌గానో ఆదరిస్తున్నారు. ఏ భాష‌కి చెందిన హీరో అయిన మంచి ఎంట‌ర్ టైన్‌మెంట్ సినిమా అంటే తప్ప‌క అక్కున చేర్చుకుంటున్నారు. ఖైదీ సినిమాతో బాక్సాఫీస్‏ను షేక్ చేసిన కోలీవుడ్ హీరో కార్తీ ఇప్పుడు అదే జోష్ తో జపాన్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.

నటన పరంగా కార్తీ తన పాత్రకు న్యాయం చేసిన‌ప్ప‌టికీ, ప్రేక్షకులకు మాత్రం ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో థియేటర్ల నుంచి తొందరగానే వెళ్లిపోయిన ఈ చిత్రం వెండితెర‌పై వ‌చ్చి నెలరోజులు గడవకముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జపాన్ సినిమా భారీ అంచనాలతో విడుదలై నిరాశ మిగిల్చిడంతో..ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ఓటీటీ రిలీజ్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాగా, డిసెంబ‌ర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో జ‌పాన్ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. హిందీకి సంబంధించి ప్ర‌క‌ట‌న రాలేదు.

Japan OTT Release Date know the streaming details
Japan OTT Release Date

కార్తీ కెరీర్‌లో 25వ సినిమాగా వ‌చ్చిన జ‌పాన్ చిత్రంలో టాలీవుడ్ క‌మెడియ‌న్ సునీల్ కీల‌క పాత్ర పోషించాడు. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు. డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది.ఈసినిమాలో హీరో కార్తీకి బంగారం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాగా జీవించే అత‌ను ఉన్నట్లుండి అతడు రూ.200 కోట్ల విలువైన బంగారం దొంగతనం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. చేయని నేరం నుంచి కార్తీ ఎలా తప్పించుకున్నాడనేది జపాన్ చిత్రం. థియేట‌ర్‌లో మిస్ అయిన వారు ఈ మూవీని ఓటీటీలో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now