Jabardasth Naresh : జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నవారిలో నరేష్ ఒకరు. అతను చూడడానికి చిన్నగా కనిపిస్తాడు కాని ఆయన వేసే పంచ్ లు, డైలాగులు మాత్రం కేక పెట్టించే విధంగా ఉంటాయి. మనల్ని కడుపుబ్బ నవ్వించే నరేష్ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. నరేష్ పుట్టిన సమయంలోనే డాక్టర్లు బ్రతకరని చెప్పారు. చాలా రోజులు ఆయనను వెంటిలేషన్ పైనే ఉంచారట. అలా మెల్లిగా క్యూరైన నరేష్, ప్రస్తుతం పదిమందిని నవ్వులతో బ్రతికిస్తున్నాడు. అలాంటి నరేష్ జబర్దస్త్ షో ద్వారా జబర్దస్త్ నరేష్ గా మారారు. జనగామ జిల్లాకు చెందిన నరేష్, చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో సినిమాల కోసం ప్రయత్నాలు చేశాడు.
నరేష్ కోసం ఏకంగా తన కుటుంబం హైదరాబాద్ కు వచ్చేసింది. సినిమాల్లో చాన్సులు రాకపోవడంతో నిరాశ చెందలేదు. కానీ ఓసారి ఢీ షో కి సంబంధించి అడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. కానీ అందులో సెలెక్ట్ కాలేదు. ఓసారి జబర్ధస్త్‌లో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడకి వెళ్లిన నరేష్‌కి గాలిపటాల సుధాకర్ ఆకర్షితుడై బుల్లెట్ భాస్కర్ కి పరిచయం చేశాడు. ఆ విధంగా చలాకి చంటి మొదటిసారి నరేష్ కి అవకాశం ఇచ్చాడు. అతడికి పెళ్లైందని, ఆయన భార్య ఆత్మహత్య చేసుకుందనే టాక్ కూడా నడిచింది. అయితే తాజాగా నరేష్ తన ప్రేయసిని పరిచయం చేసి షాకిచ్చాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రెండేళ్లపాటు చాలా సీక్రెట్‌గా మెయింటేన్ చేశాను. నాకూ ఒక లవర్ ఉంది అని చెబుతూ తన ప్రియురాలిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఇక ఆమె రావడంతో ఇద్దరు డ్యూయట్ వేసుకున్నారు. ఇక నరేష్ ప్రియురాలు మాట్లాడుతూ అతను మాటల్లో చెప్పలేనంత లవ్ చేశారు. అంతటి ప్రేమనిచ్చాడు ఈ రెండేళ్లలో అని తెలిసింది అని పేర్కొంది..ఇక నరేష్.. స్టేజ్‌పైనే ఆమెకి గులాబీ పువ్వు ఇస్తూ లవ్‌ని ప్రపోజ్ చేశాడు. ఇక హార్ట్ బెలూన్, రోజాపువ్వు తీసుకుని అతనికి ముద్దు పెట్టింది నరేష్ ప్రియురాలు. ఇక షోకి నరేష్ తండ్రి కూడా హాజరు కాగా, ఆయన పాదాలకి వారిద్దరు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. మరి ఇది నిజమా లేదా తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…