Sreeleela : శ్రీలీల.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో శ్రీలీలకి వరుస అవకాశాలు వస్తున్నాయి. స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు ‘గుంటూరు కారం, పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , నితిన్ ‘ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్’, విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.
అయితే ఇటీవల ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది శ్రీలీల. ఈ మూవీకి సంబంధించి పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన శ్రీలీల తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనికి ఉండాల్సిన క్వాలిటీలు ఏంటి? తదితర అంశాలను సరదాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది . ‘ నన్ను చేసుకోబోయేవాడికి ముచ్చటగా మూడు లక్షణాలుండాలి. అవి కూడా చాలా సింపుల్ లక్షణాలు. అందులో మొదటిది.. కొన్ని విషయాల్లో నన్ను భరించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించాలి.. భరించాలి. రెండు.. అతనికి చక్కని హాస్య చతురత ఉండాలి. సెన్సాఫ్‌హ్యూమర్‌తో నవ్వించేవాడైవుండాలి. మూడు.. కాస్త ఫ్యామిలీ టైప్‌గా పద్దతిగా అందంగా ఉండాలి. అంతే సింపుల్.. ఈ మూడు గుణాలు ఉంటే చాలు. అతడిని నేను పెళ్లి చేసుకుంటానంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది.
మరి ఈ అమ్మడికి అలాంటివాడు ఎక్కడైనా తారసపడ్డాడా? అని అడిగితే ‘లేదు.. ఒక వేళ కనిపించినా కాన్సన్‌ట్రేట్ చేసేంత టైమ్ నాకులేదు. నేను బిజీ..’ అంటూ శ్రీలీల ఆసక్తికర కామెంట్ చేసింది. ఇక కుర్రాళ్ళలో శ్రీలీలకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. శ్రీలీల ఎనర్జీ, డాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీలీలను ఆరాధించే అభిమానులు ఉన్నారు. శ్రీలీలకి ఇటీవల వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. మరో మంచి హిట్ కోసం ఈ అమ్మడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…