Iraivan Review : జ‌యంర‌వి, న‌య‌న‌తార సైకో కిల్ల‌ర్ సినిమా కథ, రివ్యూ..!

October 4, 2023 10:27 AM

Iraivan Review : సైకో కిల్లర్ కథాంశం తో జయం రవి, నయనతార కాంబినేషన్ లో ఇరైవన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది..?, ఈ సినిమా కథ ఏంటి..? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తమిళ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయింది. ఐ అహ్మద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ విలన్ గా నటించారు. ఇక కథ విషయానికి వస్తే.. ఏసీపీ అర్జున్ (జ‌యంర‌వి) స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస‌ర్‌. చాలా ధైర్యవంతుడు కూడా. క్రిమిన‌ల్‌ ని శిక్షించ‌డానికి అవ‌స‌ర‌మైతే, చ‌ట్టాన్ని కూడా అతిక్ర‌మించ‌డంలో తప్పు లేదనుకునే స్వభావం కలవాడు.

సిటీ లోని చాలా మంది అమ్మాయిల్ని బ్ర‌హ్మ అలియాస్ స్మైలీ కిల్ల‌ర్ (రాహుల్ బోస్‌) హ‌త్య చేస్తాడు. అర్జున్‌ అలానే అత‌డి స్నేహితుడు ఆండ్రూకి (న‌రేన్‌) అతన్ని పట్టుకోవాలని చూస్తారు. అయితే, ఈ బ్ర‌హ్మ‌ను ప‌ట్టుకునే క్రమం లో ఆండ్రూ చ‌నిపోతాడు. ఆండ్రూ కుటుంబ‌ బాధ్య‌త‌ల్ని అర్జున్ తీసుకుంటాడు. పోలీస్ ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాడు. ఆండ్రూ చెల్లెలు ప్రియ‌తో (న‌య‌న‌తార‌) పాటు కాఫీ షాప్ ఓపెన్ చేస్తాడు.

Iraivan Review know how is the movie in telugu
Iraivan Review

జైలు నుంచి త‌ప్పించుకున్న బ్ర‌హ్మ కిడ్నపులు స్టార్ట్ చేస్తాడు. బ్ర‌హ్మ‌ను తెలివిగా పోలీసులే షూట్ చేసేటట్టు అర్జున్ ప్లాన్ చేస్తాడు. ఇకపోతే, బ్ర‌హ్మ చ‌నిపోయినా హ‌త్య‌లు మాత్రం ఆగవు. అతని లానే ఇంకో సైకో కిల్ల‌ర్ అమ్మాయిల్ని చంపడం స్టార్ట్ చేస్తాడు.

మరి అత‌డు ఎవ‌రు..? ఆండ్రూ భార్యా కూతురి తో పాటు ప్రియ‌ను అర్జున్ ఎలా సేవ్ చేస్తాడు..? బాబు (వినోద్ కిష‌న్‌) ని సైకో కిల్ల‌ర్‌గా అర్జున్ ఎందుకు అనుమానించాడు…? బ్ర‌హ్మ‌ తో బాబుకు ఉన్న సంబంధం ఏమిటి…? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment