నందమూరి కుటుంబం నుంచి ఒక్క విజయం కూడా అందుకోని ఏకైక హీరో తారకరత్న అని చెప్పాలి. నందమూరి మోహన కృష్ణ తనయుడు అయిన ఈయన… జనవరి 27న ఈయన లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకి కూడా తరలించారని తెలుస్తుంది. ఈ నందమూరి హీరో ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. తారకరత్న ఆస్పత్రిలో ఉండగానే అతడి భార్య అలేఖ్య రెడ్డి ఫ్యామిలీ, పర్సనల్ సీక్రెట్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
అలేఖ్య రెడ్డి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరదలి కూతురు కావడంతో పాటు తారకరత్నను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆమెకి సంబంధించిన విషయాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తారకరత్నను వివాహం చేసుకోడానికి ముందే అలేఖ్య రెడ్డికి పెళ్లి జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డిని ఆమె వివాహం చేసుకోగా, అతడితో దాదాపు నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో సందీప్ రెడ్డికి అలేఖ్య విడాకులు ఇచ్చింది.విడాకులు అయిన తర్వాత కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసింది అలేఖ్య . ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు కూడా పని చేసింది. ఆ సమయంలోనే అలేఖ్య – తారకరత్న మధ్య స్నేహం పెరిగింది.
ఓ సారి తారకరత్న అలేఖ్యకి ప్రపోజ్ చేయగా, తాను తన ఇంట్లో అడగమని చెప్పిందట. సినిమా బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల అలేఖ్య ఫ్యామిలీ తారకరత్నని ఒప్పుకోలేదు. అంతకు ముందే విడాకులు తీసుకోవడం వల్ల తారకరత్న కుటుంబం వీళ్లిద్దరి పెళ్లికి అడ్డుగా నిలిచినట్లు తెలిసింది. ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోకపోయినా అలేఖ్య రెడ్డి – నందమూరి తారకరత్న 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతూ ఓ పాపకు జన్మనిచ్చారు. తారకరత్న బర్త్ డేకి బాలయ్యని ఇన్వైట్ చేయగా, ఆయనతో పాటు నారా లోకేష్ రావడం అలా నెమ్మదిగా నందమూరి ఫ్యామిలీకి దగ్గర కావడం జరిగింది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…