Hyper Aadi : అర్ధ‌రాత్రి సుడిగాలి సుధీర్ ఏం చేస్తాడో చెప్పిన హైపర్ ఆది.. అంద‌రూ షాక‌య్యారుగా..!

December 2, 2023 3:19 PM

Hyper Aadi : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన క‌మెడీయ‌న్ హైప‌ర్ ఆది. ఓ వైపు బుల్లితెరపై హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఉన్న హైపర్ ఆది.. సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్ట్‌గా మారాడు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి.. సినిమా అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన ఆది ఇప్పుడు ఉన్న‌త స్థాయిలో ఉన్నాడు. ఆయ‌న కాల్షీట్స్ కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. అయితే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండ‌డానికికార‌ణం జబర్దస్త్.. ఈటీవీ.. మల్లెమాల వల్లే అని అంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆదయ్య.. హైపర్ ఆదిగా ఎలా మారాడు.. తన రెమ్యూనరేషన్ వివరాలతో పాటు.. తన ఎడ్యుకేషనల్ క్వాలిషికేషన్ గురించి కూడా చెప్పి అంద‌రిని ఆశ్చర్య‌ప‌రిచాడు.

కాలేజ్ రోజుల్లో నేను మిమిక్రీ చేసేవాడిని .. అలాగే ఇమిటేట్ చేసేవాడిని. పంచ్ లు వేయడం కూడా అప్పటి నుంచే ఉంది. ఇక నటన విషయానికి వస్తే, మా నాన్న నాటకాలు వేసేవాడు. ఆయనను చూస్తూ పెరగడం వలన, ఆయన నుంచి నటన అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం .. మా చదువుల కోసం మా నాన్న 20 లక్షల వరకూ అప్పుచేశాడు. నేను జాబ్ చేయడం వలన వచ్చిన డబ్బు, వడ్డీలు కట్టడానికి సరిపోయేది. ఇలా ఎంతకాలం అనిపించింది .. మాట పడటం ఇష్టం లేక, మాకున్న 3 ఎకరాలు అమ్మేశాము. కాకపోతే ఈ విషయంలో మా అమ్మానాన్నలను ఒప్పించడం కొంచెం కష్టమైంది అంతే” అని చెప్పాడు.

Hyper Aadi sensational comments on sudigali sudheer
Hyper Aadi

ఇక ఢీ షోలో తాజాగా సంద‌డి చేసిన ఆది.. సుధీర్‌పై అదిరిపోయే పంచ్‌లు వేశాడు. `సుధీర్‌ ఈజ్‌ బ్యాక్‌` అంటూ బ్యాండ్‌ కూడా వేసుకున్నారు. ఏంచేస్తున్నావని హైపర్‌ ఆది.. సుధీర్‌ని అడిగారు. బాలీవుడ్‌ నుంచి రెండు స్టోరీస్‌ వచ్చాయి రా వింటున్నా అన్నాడు సుధీర్‌. దీనికి `నేను కూడా వింటున్నా అన్నా..అని ఏం కథలని అడగ్గా `నువ్వు చెప్పే సొళ్లు కథలు` అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ వేశాడు ఆది. ఇక రాత్రిళ్లు ఏం చేస్తాడో మొత్తం చెప్పేశాడు. రాత్రి 10.30 వరకే `కాలింగ్‌ సహస్త్ర` అని.. పదిన్నర దాటిందా.. కాలింగ్‌ గీత, కాలింగ్‌ సరళ.. ఫస్ట్ కాలింగ్‌.. ఆ తర్వాత కూలింగ్‌. ఆ తర్వాత లింగడి లింగడి లింగడి.. అంటూ సుధీర్ గురించి అసలు విషయం చెప్పాడు ఆది. ఆ త‌ర్వాత ఆది, సుధీర్, ప్ర‌దీప్ మ‌ధ్య జ‌రిగిన సంద‌డి ప్రేక్ష‌కుల‌ని తెగ ఎంట‌ర్‌టైన్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now