Tamannaah : ఈవిడ త‌మ‌న్నానా.. అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉందిగా..!

February 14, 2023 12:05 PM

Tamannaah : హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టిన త‌మ‌న్నాఇప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న జ‌త క‌డుతూ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. త‌మ‌న్నా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించి అల‌రించింది. ఈ అమ్మ‌డు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్ళొస్తోంది అని ఆమెకు బాలీవుడ్ లో ఒక పెద్ద ఆఫర్ వచ్చిందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో త్వరలో స్ట్రీమ్ కాబోతున్న లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ అయినా లస్ట్ స్టోరీస్ 2 లో త‌మ‌న్నా ఆఫ‌ర్ ద‌క్కించుకుంద‌ని టాక్.

నిజజీవితంలో తన బాయ్ ఫ్రెండ్ అయినా విజయ్ వర్మతో నే తాను తెర మీద కూడా రొమాన్స్ చేయబోతోందట. ఇది సెట్స్ మీద ఉన్న‌ప్పుడే విజయ్ వర్మ ని తమన్నా కలుసుకుందని ఆ తరువాతే వారి మధ్య పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారిందని కొందరు చెబుతున్నారు. ఇది త‌మ‌న్నా కెరియ‌ర్‌కి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పుకొస్తున్నారు. అయితే త‌మ‌న్నా గ్లామ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మేక‌ప్ వేయ‌క‌పోయిన ఈ అమ్మ‌డు త‌న అందచందాల‌తో ఎంత‌గానో ఆక‌ర్షిస్తూ ఉంటుంది. తమన్నా సినిమాల్లోకి రాకముందు ఒక యాడ్ లో నటించింది. ఆ యాడ్ లో తమన్నా డీగ్లామరస్ గా కనిపించాల్సి వచ్చింది.

have you seen Tamannaah ad she is completely unrecognisable
Tamannaah

యాడ్ కి సంబంధించి త‌మ‌న్నా మొదట డీగ్లామరస్ గా కనిపించాలి. ఫెయిర్ అండ్ లవ్లీ అంటి మార్క్స్ క్రీమ్ కాబట్టి ఆ తరవాత తెల్లగా కనిపించాలి. దీని కోసం తమన్నా ని డీ గ్లామరస్ గా చూపించాల్సి వచ్చింది. ఆలా డీ గ్లామరస్ గా కనిపించిన తమన్నా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో లో వైర‌ల్ అవుతుండ‌గా, త‌మ‌న్నా లుక్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.బాబోయ్ ఎంతో అందంగా ఉండే త‌మ‌న్నా ఎలా మ‌రిపోయిందంటూ ఆశ్చ‌ర్య‌చ‌కితులవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now