Hansika Motwani : స్కిన్ మాఫియా జ‌రుగుతుంది అంటూ హ‌న్సిక ఆస‌క్తిక‌ర కామెంట్స్

November 17, 2023 2:52 PM

Hansika Motwani : దేశ‌ముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక‌.శ్రీ‌నివాస్ ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. చిత్రంలో ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. నవంబ‌ర్ 17న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ చిత్రంగా ఇది రూపొంద‌గ‌గా, ఇలాంటి జాన‌ర్‌లో హన్సిక చిత్రం చేయ‌డం ఇదే తొలిసారి. ఇందులో హ‌న్సిక పాత్ర ఓ ట్రాప్‌లో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

సినిమాలో శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్ కాగా, హ‌న్సిక త‌ల్లి అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేసే క్రమంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని త‌ల్లిని అడిగింట‌. తను కూడా ఎక్కడో ఇలాంటి ఘటన జరిగినట్లు చదివానని చెప్పింది” అని హన్సిక చెప్పుకొచ్చింది.ఇక ఈ చిత్రంలో ఫస్టాఫ్ ఇంటర్వెల్ లో ఓ మర్డర్ ట్విస్ట్ ఇచ్చి సినిమాపై ఆసక్తిని రేపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో ఏం జరుగుతుందనే ఉత్కంఠకి గురి చేసిన తీరు ఫర్వాలేదనిపించింది. సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ చేస్తూ వచ్చాడు.

Hansika Motwani sensational comments on skim mafia
Hansika Motwani

ట్రాప్ లో పడిన హన్సిక పెర్ఫార్మెన్స్ తో అద‌రహో అనిపించింది.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించినా స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది అని కొంద‌రు అంటున్నారు.. దీంతో పాటు ఇన్వెస్టిగేషన్‌ అంశాల్లో ఇంకాస్త పరిణితి అవసరం అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే స్కిన్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. మంచి సందేశం ఇచ్చారు.సినిమా భారాన్నంతా తన భుజాలపై వేసుకొని.. గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయింది హన్సిక‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now