Guppedantha Manasu November 3rd Episode : వ‌సుధార‌ పంచ్‌లు, దేవయాని, శైలేంద్ర అలా అయ్యారు.. ఒక ఆట ఆడేసుకున్న ధరణి..!

November 3, 2023 8:51 AM

Guppedantha Manasu November 3rd Episode : జగతి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ముకుంద్ అనే స్పెషల్ ఆఫీసర్ ని, అపాయింట్ చేస్తారు. అతనిని తీసుకువెళ్లి, ఫణింద్ర తో పాటుగా, దేవయాని, శైలేంద్ర కి కూడా పరిచయం చేస్తాడు రిషి. అతడిని చూడగానే శైలేంద్ర, దేవయాని కంగారు పడిపోతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళని, అవసరమైతే మన అనుకున్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని, ముకుల్ కి వసుధారా చెప్తుంది. ఆమె మాటలు విని శైలేంద్ర, దేవయాని కంగారు పడతాడు. వసుధారా ఆలోచనతో ముకుల్ ఏకీభవిస్తాడు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ముందు ఫ్యామిలీ మెంబర్స్ని ఎంక్వయిరీ చేసి తర్వాత స్నేహితులని, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తామని ముకుల్ చెప్తాడు.

మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం లేదని, మేము చాలా క్లోజ్ గా ఉంటామని దేవయాని అంటుంది. ఇప్పుడు, చాలా కేసుల్లో ఇంట్లో వాళ్ళే నేరస్తులుగా బయటపడుతున్నారని, దేవయానికి వసుధార చెప్తుంది. జగతి మరణానికి, మన ఇంట్లో వాళ్ళు కారణమని అంటున్నావా అని వసుధారపై మండిపడుతుంది దేవయాని. నేను అలా అనట్లేదు. ఎవరినీ వదిలిపెట్టకుండా, ఎంక్వైరీ చూస్తే మంచిదని అంటున్నానని వసుధార అంటుంది. మనం తప్పు చేయకపోవచ్చు. కానీ మనల్ని ఆధారంగా చేసుకుని వెనక గోతులు తీసే వాళ్ళు ఉంటారు. నేనేనా మీరైనా అవ్వచ్చు. శైలేంద్ర అవ్వచ్చు అని వసుధారా బాంబు పేలుస్తుంది.

ఫణీంద్రని మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని ముకుల్ అడుగుతాడు. తమకు ఎవరు శత్రువులు లేరని, ఫణీంద్ర అంటాడు. ఎమ్మెస్సార్ ఉన్నాడు కదా అని వసుధార అంటుంది. ఎం ఎస్ ఆర్ మోసం చేసే వాడే కానీ, హత్యలు చేసేవాడని నేను అనుకోవట్లేదు అని రిషి అంటాడు. వసుధార కావాలని తనని టార్గెట్ చేసినట్టు, శైలేంద్ర కనిపెడతాడు. ఎమ్మెస్సార్ ద్వారా తన పేరుని బయటపెట్టాలని అనుకుంటుందని కంగారు పడతాడు. జగతి చనిపోయిన చోట మీరు ఉన్నారు కదా అని ముకుల్ వసుధార ని అడుగుతాడు. జగతిని టార్గెట్ చేసిన విషయం, మీకు ఎలా తెలిసిందని అడుగుతాడు.

Guppedantha Manasu November 3rd Episode today
Guppedantha Manasu November 3rd Episode

ధరణి ద్వారా ఆ విషయం తనకి తెలిసిందని వసుధార అంటుంది. గతంలో రిషి పై చాలా సార్లు అటాక్స్ జరిగాయని, ఆ రోజు కూడా అలా జరుగుతుందని అనుమానంతో అక్కడికి వెళ్లానని, కానీ జగతి మేడం చనిపోతారని ఊహించలేదని, వసుధార అంటుంది. ఎప్పటినుండి రిషి మీద ఎటాక్ జరుగుతున్నాయని అడిగితే, మా ఆయన ఫారెన్ నుండి వచ్చినప్పటినుండి అని ధరణి సమాధానం చెబుతుంది. ఆమె ఆన్సర్ తో శైలేంద్ర షాక్ అవుతాడు. దేవయాని, శైలేంద్ర ఆ మాట ని కవర్ చేయడానికి చాలా కష్టపడతారు. ధరణి వట్టి అమాయకురాలు అని శైలేంద్ర అంటాడు.

అమాయకరాలు కాబట్టే ధరణి నిజం చెప్పిందని వసుధర అంటుంది. ధరణి దగ్గర తను చాలాసార్లు బాధపడే వాడినని, అందుకే నేను వచ్చినప్పటి నుండి అని చెప్పిందని చెప్తాడు శైలేంద్ర. జగతిని చంపింది ఎవరో త్వరలోనే, తను తెలుసుకుంటారని ముకుల్ చెప్తాడు. మా ఇంట్లో వారి మధ్య గొడవలు లేవని, శైలేంద్ర అంటాడు. అలా అనుకుంటే భూషణ్ ఫ్యామిలీని అవమానించినట్లే అని అంటాడు. అలా అనుకోవడం తప్పు అని శైలేంద్ర కి ఝలక్ ఇస్తాడు. రిషి ముకుల్ విచారణకి అందరం సపోర్ట్ చేయాలని చెప్తాడు. నిజం తెలుసుకునే ప్రయత్నం అతను చేస్తున్నాడని అడిగిన వాటికి సమాధానం చెప్పాలని, అంటాడు ఫణింద్ర.

జగతి ప్రాణం తీసిన వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలని, ముకుల్ తో ఫణింద్ర అంటాడు. జగతి మేడం శిష్యుడుగా, కేసుని పర్సనల్ గా తీసుకుంటున్నట్లు చెప్తాడు. మేడం కాల్ లిస్ట్ మొత్తం తీసుకున్నామని, ఆమెతో ఎవరెవరు మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని చెప్తాడు. జగతి మర్డర్ జరిగిన ప్రదేశం నుండి, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని కూడా చెప్తాడు. ముకుల్ ఏ సమాచారం అడిగిన, ఇవ్వాలని పెదనాన్నని కోరుతాడు రిషి. తప్పకుండా అని చెప్తాడు ఫణీంద్ర. నువ్వు కూడా సహకరిస్తానని చెప్పు అని దేవాయనిపై సెటైర్ వేస్తాడు.

ముకుల్ గురించి ముందే చెప్పనందుకు బాధపడుతున్నావా అని వసుధారని అడుగుతాడు. మీరు ఏం చేసినా సరైనదే చేస్తారు. ఆలోచించే చేస్తారు. చెప్పి చేయాల్సిన అవసరం లేదని భర్తకి చెప్తుంది వసుధార. మల్లెపూల మాల అల్లుతూ ఉంటుంది.. ఆ మల్లెపూలు చూసి, రిషి గతంలో కి వెళ్తాడు. ఇద్దరూ ప్రేమ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటారు. తర్వాత మల్లెపూలు కట్టడంలో వసుధార కి సహాయం చేస్తాడు. తర్వాత ఇద్దరు కాస్త రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. మల్లెపూల మాలను వసుధార జడలు తానే పెడతాడు. అది చూసి ఆమె సిగ్గుపడుతుంది.

మల్లెపూలు మాలలో అందంగా ఉన్నావని వసుధారని మెచ్చుకుంటాడు. ఈ మల్లెపూలు లాగే మన బంధం ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలని అంటాడు. తన ప్లాన్ లు మొత్తం బెడిసి కొట్టడంతో, శైలేంద్ర కోపాన్ని తట్టుకోలేక పోతాడు. తనకి తానే, శిక్ష వేసుకోవాలని అనుకుంటాడు. బెల్ట్ తో కొట్టుకుంటాడు. దేవయని అది చూసి కంగారుపడుతుంది. అతన్ని అడ్డుకుంటుంది. కాఫీ కప్ తో ధరణి అక్కడికి వస్తుంది. ధరణి మీద మండిపడుతుంది. దేవయాని మా ఆయన టెన్షన్లో ఏం చేయాలో తెలియక, బెల్ట్ తో కొట్టుకుంటున్నాడని టెన్షన్ తగ్గించడానికి కాఫీ తీసుకొచ్చాను అని అంటుంది. శైలేంద్ర, ధరణి మీద సీరియస్ అవుతాడు. ఇలాంటి రోజు మీకు వస్తుందని ముందే ఊహించాలని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now