వినోదం

Guppedantha Manasu November 16th Episode : రంగంలోకి దిగిన అనుప‌మ‌.. దేవ‌యాని, శైలేంద్ర‌కి టెన్ష‌న్‌..!

Guppedantha Manasu November 16th Episode : రిషి కిచెన్‌లో వంట చేస్తుంటాడు. వ‌సుధార ఎందుకు ఇదంతా అని అంటుంది. ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా మీకు తెలియదు అంటుంది. ఇదిగో ఉప్పు, ఇదిగో కారం అంటూ అన్నీ చూపిస్తూ బియ్యాన్ని ఒంపేస్తాడు. అవి ఇద్దరిపై తలంబ్రాల‌లా పడతాయి. కాసేపు ఇద్దరి కళ్లు కలుస్తాయి. సెల్ఫీలు తీసుకుని హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు. అనుపమ వచ్చిందని మహేంద్రని కలిసిందని దేవయాని టెన్షన్ పడుతుంటుంది. వాళ్లు అక్కడ ఉండిపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది, మన కళ్లముందు ఉండిఉంటే వాళ్ల ప్లాన్స్ ఏంటో తెలిసేవి అంటుంది. నువ్వు టెన్షన్ పడొద్దు, ఇకపై అక్కడ ఏం జరిగినా తెలిసి తీరుతుంది అంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ఫణీంద్ర లాగిపెట్టి కొడతాడు.

ఎప్పుడు చూసినా తీవ్రవాదుల్లా చర్చలు పెడుతూనే ఉంటారు. నీకు ఏం తెలియాలని శైలేంద్రపై ఫ‌ణీంద్ర‌ ఫైర్ అవుతాడు. ధరణిని పిలిచి నీకు అప్పగించిన పని ఏం చేశావ్ అని అడుగుతాడు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ వాళ్లిద్దరూ మాట్లాడుకుంటునే ఉన్నారంటుంది. ఇంట్లో అనర్థాలకు కారణం మీరిద్దరే అనిపిస్తోంది, మహేంద్ర ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం మీరే, అసలు జగతి చావు వెనుక కూడా మీ హస్తం ఉందా ఏంటి అని ఫ‌ణీంద్ర అంటాడు. ఈ మాట వినగానే దేవయాని – శైలేంద్ర షాక్ అవుతారు.

నువ్వు ఫారిన్ వెళ్లి ఏం చేశావ్.. ఏం నేర్చుకుని వచ్చావ్.. అసలు నీ పెళ్లి జరిగి ఎన్నాళ్లైంది.. వేళ్లు లెక్కలు పెడుతున్న శైలేంద్రకి క్లాస్ ఇస్తాడు ఫణీంద్ర. రోజంతా ఎంత బిజీగా ఉన్నా భర్తతో గడిపిన పది నిముషాలు వారికి చాలా సంతోషాన్నిస్తుంది. పెళ్లై ఇన్నాళ్లైంది ఇంతవరకూ పిల్లలు లేరు. నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే నువ్వు ఇక్కడ ఉండొద్దు మళ్లీ తిరిగి ఫారెన్ వెళ్లిపో అని హెచ్చరిస్తాడు. దేవయానీ నీకు మళ్లీ చెబుతున్నాను జాగ్రత్త అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మావయ్య జాగ్రత్తలు చెప్పారు కదా అలాగే ఉండొచ్చు కదా అనేసి ధరణి వెళ్లిపోతుంది. జగతి చావు విషయంలో మన హస్తం ఉందంటున్నారు అని దేవ‌యాని అంటుంది. అందుకు శైలేంద్ర.. అన్నిటికీ నా దగ్గర సొల్యూషన్ ఉంది అంటాడు. అనుపమ మాటలు గుర్తుచేసుకుని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అనుపమ కాల్ చేస్తుంది. కట్ చేస్తుంటే కాల్ చేస్తావేంటి, నువ్వు తెలుసుకోవాల్సింది బ్యాలెన్స్ ఉందా, నా కొడుకు అన్ని విషయాలు చెప్పాడు కదా, ఇంకా కాల్ చేస్తున్నావ్, నేను జగతిని చంపాను అన్నావ్ కదా, అలా ఎలా మాట్లాడుతున్నావ్.. అని మ‌హేంద్ర అంటాడు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని అనుపమ అంటుంది.

Guppedantha Manasu November 16th Episode

చెప్పాలి అనిపించలేదు, చెప్పలేకపోయాను, ఏంటి అనుపమ, నీజర్నలిస్ట్ మైండ్ తో నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నావా అంటాడు. తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటుంది. నన్ను ఏమీ అడగొద్దు, పూర్తిగా తెలియ‌కుండా మాట్లాడకు, నీకు తెలిసింది గోరంత అంటాడు. జగతి చనిపోయాక మీరంతా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు, నేను జర్నలిస్ట్ గా అడగడం లేదు, ఫ్రెండ్ గా అడుగుతున్నాను అంటుంది. ఈ విషయంలో నేను ఏదీ చెప్పలేను, అనుపమ ప్లీజ్, ఈ విషయం ఇంతటితో వదిలేయ్ అంటాడు. నాకు జగతి గురించి అన్ని విషయాలు తెలియాలి అంటుంది. జగతిని గుర్తుచేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్, నేను బతికి ఉన్నాను కానీ నా మనసు నా దగ్గర లేదు, ఓ పట్టాన ఉండలేకపోతున్నాను, జగతితో గడిపిన జ్ఞాపకాలు తలుచుకుంటే నా గుండె ముక్కలైపోతోంది, జగతి నా ప్రాణం అని నీకు తెలుసుకదా, నా ప్రాణం నన్ను వదిలిపోయింది, ఇంకా నీకు ఏం చెప్పాలి అంటాడు.

జగతిని ఎవరు చంపారో తెలుసుకోవాలా లేదా, ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, తనే నీ ప్రాణం అనుకుంటే నువ్వు ఇలా ఉండవు, జగతి బతికి ఉన్నన్ని రోజులు దూరంగానే ఉన్నావు కదా, తను చనిపోయాక గుర్తొస్తుందా అంటుంది, స్టాపిట్ అని మహేంద్ర అరుస్తాడు. ఇంతలో అక్కడకు వస్తారు రిషి, వసుధార. జగతి గురించి నిన్ను అడగకపోతే ఇంకెవర్ని అడగాలి అంటుంది. నువ్వు ఏ హక్కుతో అడుగుతున్నావ్, నన్ను ఇరిటేట్ చేయకు అంటాడు. మీ ఇద్దర్నీ ఒకటి చేసింది ఎవరు అని అడుగుతుంది. నీ ప్రశ్నలకు నేను కూడా చావాల్సిందే, అంతేకదా, అని కాల్ కట్ చేస్తాడు.

అనుపమ కాల్ చేస్తే డాడ్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారని వసుధారతో మాట్లాడుతాడు రిషి. అనుపమ‌కి నిజం తెలిసినా కూడా డాడ్ ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు. అమ్మ గురించి తెలిసి ఆవిడ కూడా తట్టుకోలేకపోతున్నారు వసుధారా అని రిషి అంటే, మేడంని ఇష్టపడని వాళ్లంటే ఎవ్వరూ ఉండరంటుంది వసుధార. అటు అనుపమ మహేంద్ర మాటలు తలుచుకుని బాధపడుతుంది. అసలు జగతి గురించి అడిగితే ఎందుకు చెప్పడం లేదు, అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు అందరూ మౌనంగా ఉంటున్నారు, జగతి ఎలా చనిపోయింది, ఆ చావుకి కారణం ఎవరో నాకు తెలియాలి, నాకు అన్ని విషయాలు తెలియాలంటే నేను మహేంద్ర వాళ్ల దగ్గరకు వెళ్లాలి, జగతికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలి, ఇప్పుడే అక్కడకు బయలుదేరుతాను అనుకుంటూ కిందకు దిగుతుంది.

బ్యాగ్ తీసుకుని బయలుదేరిన అనుపమని చూసి విశ్వం, ఏంజెల్ షాక్ అవుతారు. ఎక్కడకు బయలుదేరావ్ అని అడుగుతారు.. తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయి అందుకే వెళుతున్నా అంటుంది. నువ్వు ఇన్నాళ్లూ దూరంగా ఉన్నావ్ ఇప్పుడు వచ్చావ్ మళ్లీ వెళతానంటున్నావని బాధపడతాడు విశ్వం. ఇకపై మిమ్మల్ని బాధపెట్టను డాడ్ అని మాటిస్తుంది అనుపమ. ఎపిసోడ్ ముగుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…

Saturday, 24 January 2026, 9:49 PM

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM