వినోదం

Guppedantha Manasu November 14th Episode : జగతి చనిపోయిందని అంద‌రికీ తెలిసిపోయింది.. రిషిధారకి క్లారిటీ వచ్చేసినట్టే..?

Guppedantha Manasu November 14th Episode : పూర్వ విద్యార్థుల సమ్మేళనం దగ్గరకు మహేంద్రని రిషి, వసుధార తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లాక‌ మహేంద్ర తానెక్కడికి వచ్చానో తెలుసుకుని లోపలకు రానంటాడు. రిషి-వసు సర్దిచెబుతుండగా ఇంతలో అనుపమ అక్కడకు వస్తుంది. మిగిలిన కాలేజీ ఫ్రెండ్స్ వ‌చ్చి మ‌హేంద్ర‌ను పార్టీ లోప‌లికి తీసుకెళ్తారు. ఆ త‌ర్వాత జ‌గ‌తి ఎక్క‌డ ? ఆమెను ఎందుకు తీసుకురాలేద‌ని రిషిని అడుగుతుంది అనుప‌మ‌. జ‌గ‌తి, మ‌హేంద్ర మ‌ధ్య గొడ‌వ‌లు ఇంకా స‌మ‌సిపోలేదా, మీలా వారిద్ద‌రు సంతోషంగా ఉండాల‌ని మీకు అనిపించ‌డం లేదా అని అడుగుతుంది. ఏం వసుధారా మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటున్నారో మీ అత్తయ్య, మావయ్య‌ కూడా హ్యాపీగా ఉండాలని లేదా అని నిలదీస్తుంది. అమ్మ గురించి మీకో విషయం చెప్పాలని రిషి మొదలుపెడతాడు. ఇంతలో ఫ్రెండ్స్ వచ్చి అనుపమని లోపలకు తీసుకెళ్లిపోతారు. అసలు ఈవిడకు జగతి గురించి ఎలా తెలుసు అనుకుంటారు రిషి, వసు.

సమ్మేళనం ప్రారంభమవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. జోక్స్ చెప్పుకుంటారు నవ్వుకుంటారు. ఆ తర్వాత అనుపమ స్టేజ్ పై మాట్లాడుతుంది. కాలేజీ రోజులన్నీ కళ్లముందు తిరుగుతున్నాయంటుంది. సరిగ్గా గుర్తులేదు కానీ ఎక్కడో కొటేషన్ చదివాను. నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. మనుషులు దూరమైనా మనసులు దగ్గరగా ఉంటాయనే కొటేషన్ చెబుతుంది. నా లైఫ్ లో మీరంతా అలాంటి స్నేహితులే అంటుంది. ఇంతలో స్టేజ్ కింద నుంచి జగతి-మహేంద్ర నీకు క్లోజ్ ఫ్రెండ్స్ కదా అంటారు. అవునన్న అనుపమ ముగ్గురు కలసి చేసిన అల్లరి గురించి, సరదాగా స్పెండ్ చేసిన సమయం గురించి చెబుతుంది. ఆ రోజులు తిరిగొస్తే బావుండును అనిపిస్తోంది, (నువ్వు అనుకున్నట్టే కాలచక్రం వెనక్కు వెళ్లి జగతి బతికి ఉండే బావుండును అనుకుంటాడు మహేంద్ర). అందరూ స్టేజ్ పై మాట్లాడండి అంటుంది.

రిషి-వసుధారకి అనుపమ-జగతి-మహేంద్ర ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఇంతలో విశ్వనాథం, ఏంజెల్ అక్కడకు వస్తారు. రిషి-వసుధార పలకరించినా ఏంజెల్ చికాకు పడుతుంది. మీరేంటి ఇక్కడ అని వసుధార అడిగితే డాడ్ అంటూ అక్కడకు వస్తుంది అనుపమ. మీరేంటి లేటుగా వచ్చారని అడుగుతుంది. ఆ పిలుపు విని రిషి, మ‌హేంద్ర‌తో పాటు వ‌సుధార ఆశ్చ‌ర్య‌పోతారు. విశ్వ‌నాథం త‌న తండ్రి అని రిషికి చెబుతుంది అనుప‌మ‌. మీకు అనుప‌మ అనే కూతురు ఉంద‌నే విష‌యం నాతో ఎప్పుడు చెప్ప‌లేదు ఎందుక‌ని అని విశ్వ‌నాథాన్ని అడుగుతాడు రిషి. నువ్వు మాత్రం నాకు అన్ని చెప్పే చేశావా అంటూ రిషిపై సెటైర్ వేస్తాడు విశ్వ‌నాథం. జ‌గ‌తి, మ‌హేంద్ర‌, తాను క‌లిసి చ‌దువుకున్న‌ట్లు విశ్వ‌నాథంతో చెబుతుంది అనుప‌మ‌.

Guppedantha Manasu November 14th Episode

పార్టీలో మ‌హేంద్ర మాట్లాడాల‌ని స్నేహితులు బ‌ల‌వంతం చేస్తారు. తాను మాట్లాడ‌లేన‌ని మ‌హేంద్ర ఎంత చెప్పినా స్నేహితులు తన మాట‌ల్ని ప‌ట్టించుకోరు. స్నేహం కూడా ప్రేమ‌లో ఒక భాగ‌మేన‌ని తాను న‌మ్ముతాన‌ని మ‌హేంద్ర మొదలుపెట్టి ఏ బంధ‌మైనా మ‌నం ఊహించుకున్న‌ట్లుగా ఉండ‌ద‌ని, తొలుత ప‌ల‌చ‌బ‌డి ఆ త‌ర్వాత పూర్తిగా క‌నుమ‌రుగైపోతుంద‌ని మాట్లాడుతాడు. మ‌హేంద్ర మాట‌లు విని అంద‌రూ షాక‌వుతారు. జ‌గ‌తి గురించి మాట్లాడాల‌ని స్నేహితులంద‌రూ మ‌హేంద్ర‌ను రిక్వెస్ట్ చేస్తారు. కానీ మ‌హేంద్ర మాట్లాడ‌లేక‌పోతాడు. క‌న్నీళ్ల‌తో స్టేజ్ దిగి వెళ్లిపోతాడు.

జ‌గ‌తిని ఎందుకు దూరంగా పెడుతున్నావు, నిన్ను నువ్వు ఎందుకు మార్చుకోవ‌డం లేదు అంటూ అనుప‌మ‌ నిల‌దీస్తుంది. జ‌గ‌తిని ఎందుకు ఇక్క‌డికి తీసుకురాలేద‌ని మ‌హేంద్ర‌ను నిల‌దీస్తుంది. ఇంకా ఆమెను ఎందుకు వేధిస్తున్నావు. క్షోభ‌పెడుతున్నామా, వ‌సుధార మ‌ధ్య‌లో క‌ల్పించుకుని స‌మాధానం చెప్పాల‌ని చూస్తుంది. ఇది మా ముగ్గురికి సంబంధించిన విష‌యం మీరు ఎవ‌రు జోక్యం చేసుకోవ‌ద్ద‌ని అనుప‌మ అంటుంది. జ‌గ‌తిని ఇక్క‌డికి తీసుకొస్తే ఆమెను చూడాల‌ని, త‌న‌తో మాట్లాడాల‌ని ఎంతో ఆశ‌గా ఎదురుచూశాన‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. అనుప‌మ ప‌దే ప‌దే అడ‌గ‌టంతో జ‌గ‌తి చ‌నిపోయింద‌నే నిజం బ‌య‌ట‌పెడుతుంది వ‌సుధార‌. లేని మ‌నిషిని తీసుకురావ‌డం సాధ్యం కాద‌ని అంటుంది.

జగతి చనిపోయిందన్న మాట విని అనుప‌మతోపాటు అక్క‌డే ఉన్న విశ్వ‌నాథం, ఏంజెల్ కూడా షాక్ అవుతారు.
జ‌గ‌తి చ‌నిపోలేద‌ని చెప్పు అంటూ మ‌హేంద్రని గ‌ట్టిగా నిల‌దీస్తుంది. జ‌గ‌తి చ‌నిపోయింది. త‌ను నాకు దూర‌మైంది అంటూ అనుప‌మ‌తో అంటాడు మ‌హేంద్ర‌. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…

Saturday, 24 January 2026, 9:49 PM

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM