Guppedantha Manasu Jagathi : జ‌గతి మేడం ఏంటిది.. సీరియ‌ల్‌లో అంత ప‌ద్ద‌తిగా, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం ఇలా..!

December 24, 2023 8:07 PM

Guppedantha Manasu Jagathi : జ‌గ‌తి మేడం.. ఈ పేరు చెబితే అంద‌రికి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ గుర్తుకు వ‌స్తుంది. ఈ సీరియ‌ల్‌లో హీరోకి త‌ల్లిగా న‌టించి అంద‌రి మ‌న్నన‌లు పొందింది. ఇందులో జ‌గ‌తి మేడం అలియాస్ జ్యోతి రాయ్ చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించి అదుర్స్ అనిపించింది. చాలా కాలంగా సినిమా నటిగా, సీరియల్ యాక్టర్‌గా సందడి చేస్తోన్న ఈ భామ.. ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ బోల్డు షో చేస్తోంది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఈ రంగంలో తనదైన గ్లామర్‌తో మెప్పించిన ఆమె.. ‘బందె బరాటవ కాలా’ అనే సీరియల్ ద్వారా నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది. ఈ తర్వాత అదే భాషలో చాలా సీరియళ్లను కూడా చేసింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది.

చాలా భాషల్లో సీరియల్ నటిగా సందడి చేసిన జ్యోతి రాయ్.. చాలా కాలం క్రితమే ‘కన్యాదానం’ అనే సీరియల్‌తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘గుప్పెడంత మనసు’తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు పలకరించి ఇందులో జగతి అనే పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ రోల్ కారణంగా జ్యోతి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు తన అందాలు దాచుకోకుండా సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆమె ఓ సినిమాలో మెయిన్ లీడ్‌గానూ నటిస్తోంది. వెబ్ సిరీస్‌లోనూ ఆమె సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ మీదున్నాయి. మేడం రీసెంట్ గా బికినీ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Guppedantha Manasu Jagathi or jyothi rai latest photos viral
Guppedantha Manasu Jagathi

ఇందులో త‌న అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ ను, నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అరాచ‌కం సృష్టిస్తుంది.జ‌గ‌తి రాయ్‌ని ఇలా చూసి కుర్రాళ్లు మైమ‌మ‌ర‌చిపోతున్నారు. ఆమె అంద‌చందాల‌కి త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. నో మోర్ సీక్రెట్.. అనే మూవీతో పాటు ప్రెట్టీ గార్ల్ అనే వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది జ్యోతి రాయ్. తాజాగా వెబ్ సిరీస్ సెట్స్ నుంచే ఫొటోలను పంచుకున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్స్ కోసమే కాస్తా బోల్డ్ అవతారంలో దర్శనమిచ్చింద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now