Gopichand : టాలీవుడ్‌లో కొందరు హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లోను మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి వారిలో ప్రభాస్- గోపిచంద్ కాంబో ఒకటి. దర్శకుడు కుమారుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు గోపీచంద్. మొదటి హీరోగా ఈయన సినిమా నటించగా ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అనంతరం విలన్ పాత్రలలో నటించారు.ఈ క్రమంలోనే తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి ప్రభాస్ హీరోగా నటించినటువంటి వర్షం సినిమాలో ప్రభాస్ కు విలన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించారు గోపిచంద్. అయితే ప్రస్తుతం హీరోగా నటిస్తున్న గోపిచంద్ ఇప్పుడు ప్రబాస్ కోసం విలన్‌గా మారబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విలన్ గా గోపిచంద్‌ని అనుకన్నారట. అయితే హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో గోపిచంద్ విలన్ పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపడం లేదు. కాని ఇప్పుడు ప్రభాస్ కోసం విలన్ గా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
కాగా, గోపిచంద్ ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనగా తను, ప్రభాస్ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ ‘మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు కదా ఎవరామే?’ అని అడిగాడు. దానికి ప్రభాస్, గోపిచంద్‌తో ‘చెప్పొద్దురా’ అంటూ అడ్డుకున్నాడు. కానీ గోపిచంద్ ‘అవును సర్ మేము 2004లో వర్షం సినిమాలో త్రిష కోసం గొడవపడ్డాం’ అని చెప్పాడు. దానికి ప్రభాస్ ‘మా వాడు సూపర్‌గా సమాధానం ఇచ్చాడు’ అంటూ నవ్వాడు. ఇదంతా చూస్తున్న బాలకృష్ణ ‘ఒంగోలు తెలివితేటలు ఇక్కడ వాడకు’ అంటూ గోపిచంద్‌ను సరదాగా అన్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…