Faria Abdullah : ఫ‌రియా అబ్ధుల్లా సండే ట్రీట్ పిచ్చెక్కించేలా ఉందిగా.. మైండ్ బ్లాక్ కావ‌ల్సిందే..!

November 26, 2023 4:01 PM

Faria Abdullah : కొంద‌రు భామ‌లు ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలాంటి వారిలో జాతిర‌త్నాలు బ్యూటీ ఫ‌రియా అబ్ధుల్లా ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. జాతిరత్నలు సినిమాలో అమాయకమైన అమ్మాయిగా చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలతో బిజిగా మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. హీరోయిన్‌గా ముద్దుగుమ్మ‌కి అవ‌కాశాలు రాని నేప‌థ్యంలో ఫ‌రియా.. స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది . నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి అలరించింది ఫరియా అబ్దుల్లా.

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే భామల్లో టాప్‌లో ఉంటుంది ఫరియా అబ్దుల్లా డ్యాన్సింగ్ వీడియోలతో సూపర్ పాపులర్ అవుతుంది. హైదరాబాదీ భామ చిట్టీ పాత్రలో క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిట్టిపోట్టి దుస్తుల‌లో కుర్రాళ్ల‌కి హీటెక్కించింది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి పొట్టి నిక్కర్ లో అరాచ‌కం సృష్టించింది.ఫ‌రియాని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రి మైండ్ బ్లాక్ అవుతుంద‌నే చెప్పాలి.

Faria Abdullah white color dress photos viral
Faria Abdullah

ఫ‌రియా అబ్ధుల్లాకి సంబంధించిన‌ స్టిల్స్‌ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్‌ చూసిన నెటిజన్లు గౌరవప్రదమైన మోడ్రన్‌ హీరోయిన్‌.. అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ ఏడాది రావణాసుర సినిమాలో వన్ ఆఫ్‌ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో మెరిసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. నీలా మడ్‌హబ్‌ పాండా దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ వెబ్‌సిరీస్ ది జెంగ‌బూరు క‌ర్స్‌లో లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటించింది ఫరియా అబ్దుల్లా. మంచి టాలెంట్‌, కేక పెట్టించే అందం ఉన్నా కూడా ఈ భామ‌కి ఎందుకో అవ‌కాశాలు రావ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now