Dhruva Nakshatram OTT Release Date : తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ధృవ నచ్చత్తిరం సినిమా 2017లో ఈ సినిమా షూటింగ్ షురూ అయింది. అనేక ఇబ్బందులు తలెత్తటంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఓ దశలో ఈ మూవీ ఇక రాదని కూడా టాక్ కూడా వచ్చింది. తెలుగులో ‘ధృవ నక్షత్రం’ పేరుతో మూవీని రిలీజ్ చేయనున్నారు. షూటింగ్‌తో పాటు చిత్ర రిలీజ్‌లో ఇబ్బందుల వల్ల దాదాపు ఆరేళ్లు రిలీజ్ డిలే అయ్యింది. నిర్మాతలు మధ్యలోనే వైదొలగడంతో దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకనట రాలేదు. అయితే విక్రమ్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు చెబుతోన్నారు. దాదాపు అరవై కోట్ల బడ్జెట్‌తో ధృవనక్షత్రం చిత్రం తెరకెక్కగా, ఓటీటీ హక్కుల ద్వారానే ఈ మూవీ సగానికిపైగా రికవరీ అయినట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 24, 2023న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పార్థిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్… జాన్, ధృవ్ అనే డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించి అలరించనున్నాడు. ధృవ నక్షత్రం సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
ఈ చిత్రానికి మనోజ్ పరమహంస, ఎల్ఆర్ కాథిర్, విష్ణు దేవ్ సినిమాటోగ్రాఫర్లుగా ఉన్నారు. భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో హైలైట్‍గా ఉంటాయని తెలుస్తోంది. విక్రమ్ చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా మరింత వైవిధ్యంతో కూడుకొని ఉంటుందని తెలుస్తుంది. రీసెంట్‌గా మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్‌ఎస్‌జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు గౌతమ్ మీనన్. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…