Dhoomam OTT Streaming : కేజీఎఫ్, కాంతార లాంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్ని నెలల క్రితం ధూమం అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, అపర్ణ బాలమురళి, వినీత్, అచ్యుత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా కథాంశంతో వస్తుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందన్న వార్త కూడా జోరుగా ప్రచారం జరిగింది. తెలుగు డబ్బింగ్ వర్షెన్ లేట్ అవుతుండడంతో దానిని పక్కన పెట్టేశారు.
ఆ తర్వాత మలయాళం, కన్నడ వెర్షన్స్‌కు నెగెటిట్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ రిలీజ్‌ను పూర్తిగా ఆపేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలో డైరెక్ట్‌గా తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. ధూమమ్ సినిమా విషయానికి వస్తే.. అవినాష్ (ఫహద్ ఫాజిల్), దివ్య (అపర్ణా బాలమురళి) దంపతులు. అవినాష్ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ అధినేత సిద్ (రోషన్ మ్యాథ్యూ) ఆర్బాటమైన ప్రచారంతో సిగరెట్ అమ్మకాలు పెంచేస్తాడు. సిగరెట్ల అమ్మకాలు పెరగడం, పిల్లలు ధూమపానానికి అలవాటు పడుతుండటం చూసి అవినాష్ తన ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత అవినాష్, దివ్యపై కొందరు దాడి చేస్తారు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా కథ.
ధూమమ్ సినిమాని భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. ఈ సినిమాను దాదాపు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను కేరళలో 150 స్క్రీన్లలో భారీగానే రిలీజ్ చేశారు. తొలి రోజు కేరళ, కర్నాటకలో భారీగానే ఓ మోస్తారు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ధూమం చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. అయితే ఇప్పుడు ధూమం తెలుగు వర్షెన్ ఓటీటీలో సందడి చేస్తుండగా, ఎంత రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…