Dhoomam OTT Streaming : ఇంకా థియేట‌ర్స్‌లోనే రానే రాలేదు.. అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న ధూమం

November 30, 2023 6:34 PM

Dhoomam OTT Streaming : కేజీఎఫ్, కాంతార లాంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్ని నెల‌ల క్రితం ధూమం అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. పవన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, అపర్ణ బాలమురళి, వినీత్, అచ్యుత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా కథాంశంతో వస్తుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందన్న వార్త కూడా జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. తెలుగు డ‌బ్బింగ్ వ‌ర్షెన్ లేట్ అవుతుండ‌డంతో దానిని ప‌క్క‌న పెట్టేశారు.

ఆ త‌ర్వాత మ‌ల‌యాళం, క‌న్న‌డ వెర్ష‌న్స్‌కు నెగెటిట్ టాక్ రావ‌డంతో తెలుగు వెర్ష‌న్ రిలీజ్‌ను పూర్తిగా ఆపేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలో డైరెక్ట్‌గా తెలుగు వెర్ష‌న్ రిలీజ్ చేశారు. ధూమమ్ సినిమా విషయానికి వస్తే.. అవినాష్ (ఫహద్ ఫాజిల్), దివ్య (అపర్ణా బాలమురళి) దంపతులు. అవినాష్ సిగరెట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ అధినేత సిద్ (రోషన్ మ్యాథ్యూ) ఆర్బాటమైన ప్రచారంతో సిగరెట్ అమ్మకాలు పెంచేస్తాడు. సిగరెట్ల అమ్మకాలు పెరగడం, పిల్లలు ధూమపానానికి అలవాటు పడుతుండటం చూసి అవినాష్ తన ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత అవినాష్, దివ్యపై కొందరు దాడి చేస్తారు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా కథ.

Dhoomam OTT Streaming fahadh faasil new movie
Dhoomam OTT Streaming

ధూమమ్ సినిమాని భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. ఈ సినిమాను దాదాపు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను కేరళలో 150 స్క్రీన్లలో భారీగానే రిలీజ్ చేశారు. తొలి రోజు కేరళ, కర్నాటకలో భారీగానే ఓ మోస్తారు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ధూమం చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. అయితే ఇప్పుడు ధూమం తెలుగు వ‌ర్షెన్ ఓటీటీలో సంద‌డి చేస్తుండ‌గా, ఎంత రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now