Devil Movie OTT Platform : డెవిల్ ఓటీటీ పార్ట్న‌ర్ ఫిక్స్.. టీవీలో ఎందులో ప్ర‌సారం కానుంది అంటే..!

December 29, 2023 9:13 PM

Devil Movie OTT Platform : నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా నిర్మాత‌గాను మంచి జోష్ మీదున్నాడు. కళ్యాణ్ రామ్ న‌టించిన‌ బింబిసార మంచి స‌క్సెస్ సాధించ‌గా, ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ అమిగోస్ అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇప్పుడు డెవిల్ అంటూ మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. డెవిల్ సెటప్, బ్యాక్ డ్రాప్, పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్లు ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. నేడు విడుద‌లైన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. కల్యాణ్ రామ్ యాక్టింగ్‍కు మంచి మార్కులు పడుతున్నాయి. కాగా, డెవిల్ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్, శాటిలైట్ హక్కుల సమాచారం బయటికి వచ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకే ఈ మూవీ హ‌క్కుల‌ని దక్కించుకుందని తెలుస్తోంది.

థియేట్రికల్ రన్ పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ వీడియోలో డెవిల్ చిత్రం 2024 ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో వ‌చ్చే అవ‌కాశం ఉంది. శాటిలైట్ హక్కుల డీల్ కూడా పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది.. ఈ చిత్రం శాలిలైట్ రైట్స్‌ను ఈటీవీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాతే టీవీ ఛానెల్‍లో ఈ చిత్రం ప్రసారం కానుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా మూవీని నిర్మించ‌డ‌మే కాక దర్శకుడిగానూ ఆయనే వ్యవహరించారు. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఎక్కువ భాగం తానే డైరెక్షన్ చేశానని నవీన్ మేడారం చెప్ప‌డం కాస్త వివాదమైంది.

Devil Movie OTT Platform know the streaming details
Devil Movie OTT Platform

డెవిల్’ అంటూ వచ్చిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ లో.. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలు స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో మెయిన్ పాయింట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్ లు బాగున్నాయి. మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సోనెబ్లిక్, ఎల్నాజ్ నోరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సీతా సత్య కీలకపాత్రలు పోషించారు.డెవిల్ చిత్రానికి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్ వ్యవహరించారు. చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‍గా క‌నిపించి సంద‌డి చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now