Chiranjeevi Vijetha Movie : మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడానికి దోహదపడిన సినిమాల్లో విజేత మూవీ ఒకటి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ తీసిన ఈ సినిమాకు ఎ.కోదండ రామిరెడ్డి డైరెక్టర్. అప్పటికే మూడు, ఆరు పాటలు ఉండే సినిమాలే ఎక్కువగా చేస్తూ వస్తున్న చిరంజీవి విజేత సినిమా కూడా అలాగే ఉంటుందని ఫాన్స్ భావించారు. అయితే ఫాన్స్ కి గర్వంగా చెప్పుకునేలా సరికొత్త అనుభూతి కలిగించిన ఈ మూవీ ఇది. విధి ఆడించిన నాటకంలో మధు అనే యువకుడి కథతో రూపొందిన సినిమా ఇది. శుభలేఖ తర్వాత దొరికిన మరో మంచి పాత్రగా ఈ సినిమాను చెబుతారు.
అనిల్ గంగూలీ డైరెక్షన్ లో వచ్చిన బెంగాలీ చిత్రాన్నీ తర్వాత సాహెబ్ పేరిట హిందీలో తీశారు. రెండు భాషల్లో హిట్ కొట్టినప్పటికీ తెలుగులో చిరు హీరోగా రీమేక్ గా తీయడానికి చాలా కసరత్తు చేశారు. ఫైట్స్, మాస్ అంశాలు లేని మూవీ ఇది. సాఫ్ట్ రోల్ లో చిరుని చూపించే ప్రయత్నం ఫలిస్తుందా అనే సందేహం కూడా వచ్చింది. అయితే చిరు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం, చిరంజీవి నటనకు హారతి పట్టడం నిజంగా గ్రేట్.
శారద కీలక పాత్ర పోషించగా, హీరోయిన్ భానుప్రియ గ్లామర్ కి పరిమితమైంది. రోహిణి ఈమెకు డబ్బింగ్ చెప్పగా, శ్రీలక్ష్మికి కూడా ఇంకొకరు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడిగా సెటిల్ అయిన తర్వాత జంధ్యాల ఈ మూవీ కథ విని మాటలు రాయడానికి ముందుకొచ్చారు. సాహెబ్ మూవీలో రెండు పాటల ట్యూన్స్ యథాతథంగా తీసుకోగా, నాలుగు సాంగ్స్ చక్రవర్తి స్వరపరిచారు. విజేత మూవీ అవుట్ డోర్ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరించారు.
ఇక ఈ మూవీలో కథ పరంగా రెండే రెండు ఫైట్స్ ఉన్నాయి. చినబాబు టైటిల్ పెట్టాలని అనుకుంటే, కథాపరంగా టైటిల్ పెట్టాలని చిరంజీవి చెప్పడంతో జ్యోతిచిత్ర పాఠకులకు టైటిల్ బాధ్యతను నిర్మాత అరవింద్ అప్పగించారు. ఎక్కువమంది విజేత సూచించడంతో అదే టైటిల్ గా పెట్టారు. అరవింద్ కొడుకులు అర్జున్, వెంకటేష్ కూడా నటించారు. శుభ కొడుకుగా రెండేళ్ల అర్జున్ నటించగా, నూతన్ ప్రసాద్ కొడుకుగా వెంకటేష్ నటించాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…