Pooja Room : హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు. ఇలా పూజించడంలో తప్పేమీ లేదు, కానీ దేవుడి దగ్గర, పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోలను మాత్రం ఉంచకూడదట. ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందట. ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోలను పూజ గదిలో ఉంచడం సరికాదు. దీంతో సదరు కుటుంబానికి మంచి జరగదు.
ఇండ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫొటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతోంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రసారమవుతుంది. అంతే కాదు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా మానసిక ప్రశాంతత ఉండదు.
చనిపోయిన వారి ఫొటోలను దేవుళ్ల పక్కనే ఉంచి పూజ చేయడం హిందూ ధర్మం ప్రకారం పెద్ద తప్పిదమే అవుతుంది. మనిషి ఎల్లప్పుడూ దేవుడితో సమానం కాదని, నియమాలను అతిక్రమించి అలా చేస్తే ఆ కుటంబంలో అందరికీ కష్టాలు వస్తాయని చెబుతున్నారు. కనుక చనిపోయిన వారి ఫోటోలను ఎప్పటికీ దేవుడి పక్కన లేదా పూజ గదిలో పెట్టరాదు. పెడితే అన్నీ కష్టాలే వస్తాయి.. అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…