Chiranjeevi Vijetha Movie : చిరంజీవి విజేత మూవీకి ముందు అనుకున్న టైటిల్ ఏమిటో తెలుసా..?

February 25, 2023 10:00 AM

Chiranjeevi Vijetha Movie : మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడానికి దోహదపడిన సినిమాల్లో విజేత మూవీ ఒకటి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ తీసిన ఈ సినిమాకు ఎ.కోదండ రామిరెడ్డి డైరెక్టర్. అప్పటికే మూడు, ఆరు పాటలు ఉండే సినిమాలే ఎక్కువగా చేస్తూ వస్తున్న చిరంజీవి విజేత సినిమా కూడా అలాగే ఉంటుందని ఫాన్స్ భావించారు. అయితే ఫాన్స్ కి గర్వంగా చెప్పుకునేలా సరికొత్త అనుభూతి కలిగించిన ఈ మూవీ ఇది. విధి ఆడించిన నాటకంలో మధు అనే యువకుడి కథతో రూపొందిన సినిమా ఇది. శుభలేఖ తర్వాత దొరికిన మరో మంచి పాత్రగా ఈ సినిమాను చెబుతారు.

అనిల్ గంగూలీ డైరెక్షన్ లో వచ్చిన బెంగాలీ చిత్రాన్నీ తర్వాత సాహెబ్ పేరిట హిందీలో తీశారు. రెండు భాషల్లో హిట్ కొట్టినప్పటికీ తెలుగులో చిరు హీరోగా రీమేక్ గా తీయడానికి చాలా కసరత్తు చేశారు. ఫైట్స్, మాస్ అంశాలు లేని మూవీ ఇది. సాఫ్ట్ రోల్ లో చిరుని చూపించే ప్రయత్నం ఫలిస్తుందా అనే సందేహం కూడా వచ్చింది. అయితే చిరు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం, చిరంజీవి నటనకు హారతి పట్టడం నిజంగా గ్రేట్.

Chiranjeevi Vijetha Movie interesting facts
Chiranjeevi Vijetha Movie

శారద కీలక పాత్ర పోషించగా, హీరోయిన్ భానుప్రియ గ్లామర్ కి పరిమితమైంది. రోహిణి ఈమెకు డబ్బింగ్ చెప్పగా, శ్రీలక్ష్మికి కూడా ఇంకొకరు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడిగా సెటిల్ అయిన తర్వాత జంధ్యాల ఈ మూవీ కథ విని మాటలు రాయడానికి ముందుకొచ్చారు. సాహెబ్ మూవీలో రెండు పాటల ట్యూన్స్ యథాతథంగా తీసుకోగా, నాలుగు సాంగ్స్ చక్రవర్తి స్వరపరిచారు. విజేత మూవీ అవుట్ డోర్ సన్నివేశాల‌ను ముంబైలో చిత్రీకరించారు.

ఇక ఈ మూవీలో కథ పరంగా రెండే రెండు ఫైట్స్ ఉన్నాయి. చినబాబు టైటిల్ పెట్టాలని అనుకుంటే, కథాపరంగా టైటిల్ పెట్టాలని చిరంజీవి చెప్పడంతో జ్యోతిచిత్ర పాఠకులకు టైటిల్ బాధ్యతను నిర్మాత అరవింద్ అప్పగించారు. ఎక్కువమంది విజేత సూచించడంతో అదే టైటిల్ గా పెట్టారు. అరవింద్ కొడుకులు అర్జున్, వెంకటేష్ కూడా నటించారు. శుభ కొడుకుగా రెండేళ్ల అర్జున్ నటించగా, నూతన్‌ ప్రసాద్ కొడుకుగా వెంకటేష్ నటించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now