Chiranjeevi Daddy Movie : డాడీ మూవీ ఎన్ని క‌లెక్ష‌న్ల‌ను సాధించిందో తెలుసా..? క్లైమాక్స్ అలా లేక‌పోతే ఇంకా ఎక్కువ వ‌చ్చేవి..!

February 23, 2023 9:35 PM

Chiranjeevi Daddy Movie : ఇండస్ట్రీలో స్వయంకృషితో హీరోగా ఎదిగి సుప్రీం హీరోగా ఆతర్వాత మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి నుంచి మంచి మాస్ మసాలా మూవీని ఆడియన్స్ ఆశిస్తారు. ముఖ్యంగా ఫాన్స్ కి తగ్గ మసాలా ఉండాలి. అయితే ఈ మూసలోంచి బయటకు వచ్చి ఏదైనా నటనకు స్కోప్ ఉన్న సినిమా చేస్తే ఫెయిల్ అవుతున్నాయి. అందులో రుద్రవీణ, ఆపద్భాంధవుడు ఉదాహ‌ర‌ణ‌లు అని చెప్ప‌వ‌చ్చు. అయితే నటన పరంగా అదిరిపోయిన డాడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది. మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన సురేష్ కృష్ణ డైరెక్షన్ లో 2001 అక్టోబర్ 4న వచ్చిన డాడీ మూవీ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

క్లాస్ అండ్ ఫ్యామిలీ విలువ‌లతో చిరంజీవి చేసిన డాడీ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ ఫైట్ డిజైన్ చేశాడు. ఇక అల్లు అర్జున్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడు. మృగరాజు, మంజునాథ మూవీస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. నెల్లూరు రాజ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి రామ్ చరణ్ ఆర్ధిక సాయ అందించాడు. తండ్రీ కూతుళ్ళ ఎమోషన్ తో కట్టిపడేసే ఈ మూవీలో ఎస్ఏ రాజ్ కుమార్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. కూతురు చనిపోయే సీన్ ఎమోషన్ కి గురిచేస్తుంది.

Chiranjeevi Daddy Movie collections what about ending
Chiranjeevi Daddy Movie

ఇక గుమ్మాడి గుమ్మాడి అనే సాంగ్ ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్. చిన్న పాపగా చేసిన అనుష్క ముద్దులొలికించింది. హీరోయిన్ సిమ్రాన్, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులంతా బాగానే నటించారు. 97 సెంటర్స్ లో 50, షిఫ్ట్స్ తో కలిపి 25 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. రూ.12 కోట్ల షేర్ తో యావరేజ్ అయింది. క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ మూవీ మాస్ ని అలరించలేక పోయింది. క్లైమాక్స్ నార్మల్ గా ఉండడం ఫాన్స్ కి రుచించలేదు. సాధారణంగా చిరంజీవి సినిమా అంటే పవర్ ఫుల్ విలన్ ఉండాలి. కానీ ఇది ఫ్యామిలీ సినిమా కావడంతో విలన్ కి స్కోప్ లేకుండా పోయింది. అయితే ఆడియన్స్, కొందరు చిరు ఫాన్స్ కి ఇష్టమైన మూవీగా నిలిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now