Chinna OTT Release Date : సిద్దార్థ్ న‌టించిన చిన్నా ఓటీటీ రిలీజ్ ఎందులో, ఎప్పుడు అంటే..!

November 11, 2023 10:43 AM

Chinna OTT Release Date : బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన హీరో సిద్ధార్థ్. ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన సిద్ధార్థ్ ఇప్పుడు కాస్త స్పీడ్ త‌గ్గించాడు. అయితే సిద్ధార్థ్ కి త‌మిళంలోనే కాకుండా తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ‘చిత్త’గా విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ని తెలుగులో చిన్నాగా విడుద‌ల చేశారు. ఎమోషనల్ మూవీగా ఈ సినిమా అంద‌రి ప్ర‌శంస‌లు దక్కించుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గ‌ర పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ అందిపుచ్చుకోవ‌డం లేదు. ఈ చిత్రాన్ని సిద్దార్థ్ స్వయంగా నిర్మించడం విశేషం. టైట్ స్క్రీన్ ప్లే తో, ఎమోషనల్ కంటెంట్ తో కథని నడిపిచినా జనాలను రీచ్ కాలేదు. చైల్డ్ అబ్యూజింగ్, హరాజ్మెంట్, చైల్డ్ రేప్ కేసెస్.. ఇలాంటి కంటెంట్ ని చూపించడంతో తెలుగువారికి ఈ చిత్రం పెద్ద‌గా ఎక్క‌లేదు.

సిద్ధార్థ్ హీరోగా న‌టించిన చిత్తా చిత్రంలో నిమిషా సజయన్ కథానాయికగా నటించింది. సేతుప‌తి సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న త‌మిళంలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. అయితే ఇదే సినిమాను చిన్నా అనే పేరుతో తెలుగులో అక్టోబ‌ర్ 06న విడుద‌ల చేయ‌గా.. కొన్ని రోజుల పాటు ఈ మూవీ థియేట‌ర్‌లో తెగ సంద‌డి చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు.న‌వంబ‌ర్ 17 న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయ‌నున్నార‌ని చెబుతున్నారు.

Chinna OTT Release Date
Chinna OTT Release Date

రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే చిత్రంగా రూపొందింది.. స‌డన్‌గా త‌న కూతురు కిడ్నాప్ అవ్వ‌గా.. కూతురు కోసం సిద్ధార్థ్‌ చేసే పోరాటమే ఈ సినిమా. ఇక ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది. కాగా చిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధార్థ్ ఎమోష‌న‌ల్ అయిన విష‌యం తెలిసిందే. సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని, తెలుగు వెర్షన్‍ హక్కులను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని చాలా ఫీల‌య్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now