Bigg Boss : దారుణంగా బిగ్ బాస్ రేటింగ్.. ఆ ముగ్గురినీ దించక తప్పేలా లేదు..!

October 5, 2022 7:28 PM

Bigg Boss : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే గత సీజన్లలో బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ తో కొనసాగింది. ఈ సీజన్ 6 మాత్రం పరమ బోరింగ్ గా తయారయ్యింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. అలాగే ఈ సీజన్ పై ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇక టీఆర్పీ పెంచాలని ఫిక్స్ అవడంతో నాగార్జున కూడా హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెడుతూ రెచ్చగొడుతున్నాడు. కానీ ఈసారి నాగార్జున ఏం చేసినా.. ఎంతగా ప్రయత్నించినా.. పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఈ క్రమంలోనే వారికి ఉన్న ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు బిగ్ బాస్ టీమ్.

దీంతో అతి ముఖ్యమైన వైల్డ్ కార్డ్ ను ప్రయోగించబోతున్నారట. ఫేమస్ బుల్లితెర స్టార్స్ ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట బిగ్ బాస్ టీమ్. దీంతో టీఆర్పీ ఓ రేంజ్ లో పెరుగుతుందని అంచనా వేస్తున్నారట. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లోకి వైల్డ్ కార్డుతో ఎంటర్ అవ్వబోతుంది ఎవరో కాదు జబర్దస్త్ స్టార్ కమెడియన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ ను రంగంలోకి దింపబోతున్నారట. దానికోసం అతనికి భారీగా పారితోషికం కూడా ఫిక్స్ చేశారట టీమ్. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ లో వార్ వన్ సైడ్ అవుతుంది అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అలాగే బిగ్ బాస్ లోకి తీసుకోవాలి అని ఆగిపోయిన స్టార్ కంటెస్టెంట్స్ పై కూడా బిగ్ బాస్ మేకర్స్ కన్నేసినట్టు తెలుస్తోంది.

Bigg Boss reportedly getting Sudheer and Hyper Aadi
Bigg Boss

అందులో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను కూడా ఉందట. ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటంతో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రేటింగ్ పెంచడం కోసం ఆమెను తీసుకోవాల‌ని చూస్తున్నారట. ఇక ఈ ఇద్దరితోపాటు మరో జబర్థస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాల‌ని చూస్తున్నారట. ఆది హౌస్ లో ఉంటే.. షో క‌చ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందనేది అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురిలో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా గేమ్ స్ట్రాటజీస్ మారిపోతాయి. టీఆర్పీ రేటింగ్ తప్పకుండా పెరుగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment