Balakrishna : ప్రస్తుత తరుణంలో నిర్మాతలు, దర్శకులు, ఆఖరికి హీరో హీరోయిన్లు కూడా సినిమాలను చేయడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే రీమేక్ చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్త్నున్నారు. ఇతర భాషల్లో హిట్ అయి ఉంటాయి కనుక.. మన భాషలో తీస్తే మినిమం గ్యారంటీ అన్న భావన ఉంది. అందువల్లే రీమేక్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.
ఇక కొందరైతే గతంలో పనిచేసిన కాంబినేషన్లతో మళ్లీ సినిమాలు తీస్తుంటారు. కనీసం అలా అయినా సినిమా వర్కవుట్ అవుతుందేమోనని చిన్న ఆశ. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. చిత్ర హీరో హీరోయిన్లను చూసి సినిమాలకు వచ్చేవారు. అందుకనే ఎన్‌టీఆర్, ఏఎన్నార్, వారితో కలసి నటించిన హీరోయిన్లు అంత పాపులర్ అయ్యారు.
అయితే ప్రస్తుత హీరోలకు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే దమ్ము ఉంది. కానీ వారు ప్రయోగాలను చేసేందుకు ఇష్టపడడం లేదు. అందుకనే సక్సెస్ కాంబినేషన్‌లను రిపీట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక హీరో సినిమాను అంగీకరించాక.. తన భుజాలపై మోయాలి. హీరో మొత్తం సినిమాకు డ్రైవర్‌లా మారి ముందుండి నడిపించాలి. అన్నింటినీ తాను చూసుకోవాలి. అలా చేయడం బాలకృష్ణ ఒక్కడికే సాధ్యమైందంటున్నారు.
ఇదే విషయాన్ని సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఓ వీడియో ద్వారా తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ సినీ పరిశ్రమలో ఒకప్పటి, ప్రస్తుత తరంలో చాలా మంది తారలతో అనుబంధం ఉన్న సీనియర్ నిర్మాతలలో ఒకరు. తాజాగా ఓ వీడియోలో బాలకృష్ణ అఖండ చిత్రంపై, టాలీవుడ్‌లో అది సృష్టించిన విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సాధారణంగా కొంతమంది తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు. వారికి హీరో, స్థిరపడిన హీరోయిన్, ప్రముఖ సంగీత దర్శకుడు మొదలైనవారు రావాలి. కానీ, బాలకృష్ణ సినిమాల విషయంలో అలా కాదు. ఒక ప్రాజెక్ట్‌కి సంతకం చేస్తే ఆ సినిమాను తన భుజాలపై వేసుకుని తీసుకెళ్లే దమ్ము ఉంది.. అని తమ్మారెడ్డి అన్నారు.
“ప్రజలు హీరోని చూడటానికి థియేటర్లకు వస్తారు, అతనితో ఇంకా ఎవరు నటిస్తున్నారో వారు పట్టించుకోరు. బాలకృష్ణతో సహా ఇప్పుడు నేను చెప్పిన హీరోలందరికీ జనాలను థియేటర్లకు రప్పించే దమ్ము ఉంది, ఇతర అంశాలను వారు పట్టించుకోరు” అని చెప్పారు.
అఖండలో బాలకృష్ణ నిజానికి వన్ మ్యాన్ షో చేశారని షాక్షాత్తూ విమర్శకులు కూడా అభినందిస్తున్నారు. గత చిత్రాల మాదిరిగానే ఆయన ఈ చిత్రంలోనూ ప్రేక్షకులను కట్టిపడేశారు. అందుకనే కేవలం ఆయనను చూసే సినిమాకు వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సినిమా మొత్తం హీరోపైనే ఈ విధంగా ఒక రేంజ్‌లో ఫోకస్ అయితే హిట్ పక్కా అన్న విషయం స్పష్టమవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…