Balakrishna : బాలకృష్ణనా.. మజాకా.. మరోసారి నిరూపించుకున్నారు..!

December 9, 2021 11:50 AM

Balakrishna : ప్రస్తుత తరుణంలో నిర్మాతలు, దర్శకులు, ఆఖరికి హీరో హీరోయిన్లు కూడా సినిమాలను చేయడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే రీమేక్‌ చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్త్నున్నారు. ఇతర భాషల్లో హిట్‌ అయి ఉంటాయి కనుక.. మన భాషలో తీస్తే మినిమం గ్యారంటీ అన్న భావన ఉంది. అందువల్లే రీమేక్‌ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.

Balakrishna proved once again that movie is hero show

ఇక కొందరైతే గతంలో పనిచేసిన కాంబినేషన్లతో మళ్లీ సినిమాలు తీస్తుంటారు. కనీసం అలా అయినా సినిమా వర్కవుట్ అవుతుందేమోనని చిన్న ఆశ. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. చిత్ర హీరో హీరోయిన్లను చూసి సినిమాలకు వచ్చేవారు. అందుకనే ఎన్‌టీఆర్‌, ఏఎన్నార్‌, వారితో కలసి నటించిన హీరోయిన్లు అంత పాపులర్‌ అయ్యారు.

అయితే ప్రస్తుత హీరోలకు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే దమ్ము ఉంది. కానీ వారు ప్రయోగాలను చేసేందుకు ఇష్టపడడం లేదు. అందుకనే సక్సెస్‌ కాంబినేషన్‌లను రిపీట్‌ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక హీరో సినిమాను అంగీకరించాక.. తన భుజాలపై మోయాలి. హీరో మొత్తం సినిమాకు డ్రైవర్‌లా మారి ముందుండి నడిపించాలి. అన్నింటినీ తాను చూసుకోవాలి. అలా చేయడం బాలకృష్ణ  ఒక్కడికే సాధ్యమైందంటున్నారు.

ఇదే విషయాన్ని సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఓ వీడియో ద్వారా తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ సినీ పరిశ్రమలో ఒకప్పటి, ప్రస్తుత తరంలో చాలా మంది తారలతో అనుబంధం ఉన్న సీనియర్ నిర్మాతలలో ఒకరు. తాజాగా ఓ వీడియోలో బాలకృష్ణ అఖండ చిత్రంపై, టాలీవుడ్‌లో అది సృష్టించిన విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సాధారణంగా కొంతమంది తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు. వారికి హీరో, స్థిరపడిన హీరోయిన్, ప్రముఖ సంగీత దర్శకుడు మొదలైనవారు రావాలి. కానీ, బాలకృష్ణ సినిమాల విషయంలో అలా కాదు. ఒక ప్రాజెక్ట్‌కి సంతకం చేస్తే ఆ సినిమాను తన భుజాలపై వేసుకుని తీసుకెళ్లే దమ్ము ఉంది.. అని తమ్మారెడ్డి అన్నారు.

“ప్రజలు హీరోని చూడటానికి థియేటర్లకు వస్తారు, అతనితో ఇంకా ఎవరు నటిస్తున్నారో వారు పట్టించుకోరు. బాలకృష్ణతో సహా ఇప్పుడు నేను చెప్పిన హీరోలందరికీ జనాలను థియేటర్లకు రప్పించే దమ్ము ఉంది, ఇతర అంశాలను వారు పట్టించుకోరు” అని చెప్పారు.

అఖండలో బాలకృష్ణ నిజానికి వన్ మ్యాన్ షో చేశారని షాక్షాత్తూ విమర్శకులు కూడా అభినందిస్తున్నారు. గత చిత్రాల మాదిరిగానే ఆయన ఈ చిత్రంలోనూ ప్రేక్షకులను కట్టిపడేశారు. అందుకనే కేవలం ఆయనను చూసే సినిమాకు వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సినిమా మొత్తం హీరోపైనే ఈ విధంగా ఒక రేంజ్‌లో ఫోకస్‌ అయితే హిట్‌ పక్కా అన్న విషయం స్పష్టమవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment