Aryan Khan : క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా అతను జైలులోనే ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముంబై సెషన్స్ కోర్టులో మరోసారి విచారణ జరగనుంది. మూడు సార్లు అతని బెయిల్ రిజెక్ట్ కాగా, ఈ రోజు అయినా వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ విషయంలో కావాలని కేంద్ర సర్కార్ ఇదంతా చేస్తుందని, కేంద్ర దర్యాప్తు సంస్థల వెనుక కేంద్రం హస్తం ఉందని అంటున్నారు.
కొడుకుకు బెయిల్ రాకపోవటంతో గౌరీఖాన్ ఏడుస్తుందని, షారూక్ ఖాన్ భోజనం చెయ్యటం లేదని, నిద్రపోవటం లేదని సమాచారం. మరోవైపు జైలుకు వెళ్లిన దగ్గర్నుంచి ఆర్యన్ భోజనం ముట్టుకోవడం లేదట. జైలు క్యాంటీన్‌లో కొనుక్కున్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకుంటున్నాడట. జైలులోని బాత్రూమ్‌కు ఆర్యన్ ఇప్పటివరకు వెళ్లలేదట. నాలుగు రోజులుగా స్నానం చేయలేదట.
ఇంటి నుండి తీసుకెళ్లిన నీటిని ఆర్యన్ పొదుపుగా వాడుకుంటున్నట్టు తెలుస్తుండగా, అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జైలుకి వచ్చినప్పటి నుండి ఆర్యన్ భోజనం చేయకపోవడంతో చాలా నీరసంగా అయిపోయాడట. దీంతో అతని ఆరోగ్యం గురించి జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…