Aryan Khan : షారూఖ్ త‌న‌యుడి ఆవేద‌న అంతా ఇంతా కాదు.. తిండి తినట్లేదు, బాత్‌రూంకి పోవ‌ట్లేదు..!

October 14, 2021 1:28 PM

Aryan Khan : క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ అరెస్ట్ అయి జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త వారం రోజులుగా అతను జైలులోనే ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ముంబై సెషన్స్ కోర్టులో మరోసారి విచారణ జరగనుంది. మూడు సార్లు అతని బెయిల్ రిజెక్ట్ కాగా, ఈ రోజు అయినా వ‌స్తుందా అని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ విషయంలో కావాలని కేంద్ర సర్కార్ ఇదంతా చేస్తుందని, కేంద్ర దర్యాప్తు సంస్థల వెనుక కేంద్రం హస్తం ఉందని అంటున్నారు.

Aryan Khan is not sleeping well and not eating

కొడుకుకు బెయిల్ రాకపోవటంతో గౌరీఖాన్ ఏడుస్తుందని, షారూక్ ఖాన్ భోజనం చెయ్యటం లేదని, నిద్రపోవటం లేదని సమాచారం. మ‌రోవైపు జైలుకు వెళ్లిన దగ్గర్నుంచి ఆర్యన్ భోజనం ముట్టుకోవ‌డం లేద‌ట. జైలు క్యాంటీన్‌లో కొనుక్కున్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకుంటున్నాడట. జైలులోని బాత్రూమ్‌కు ఆర్యన్ ఇప్పటివరకు వెళ్లలేదట. నాలుగు రోజులుగా స్నానం చేయలేదట.

ఇంటి నుండి తీసుకెళ్లిన నీటిని ఆర్య‌న్ పొదుపుగా వాడుకుంటున్న‌ట్టు తెలుస్తుండ‌గా, అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకొని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. జైలుకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఆర్య‌న్ భోజనం చేయకపోవడంతో చాలా నీరసంగా అయిపోయాడట. దీంతో అతని ఆరోగ్యం గురించి జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now