Aryan Khan : కార్డేలియా క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఆ కేసులో ఉండడంతో దేశమంతా ఒక్కసారిగా కంగుతింది. ఆర్యన్ ఖాన్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయితే, సరైన ఆధారాల్లేని కారణంగా మే 28న అతడికి ఆ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది.అయితే ఆ ఘటన జరిగినప్పటి నుండి ఆర్యన్ ఖాన్ పెద్దగా బయట కనిపించడం లేదు. కనిపించిన కూడా మీడియాకి మాత్రం చాలా దూరంగా ఉంటున్నాడు. అయితే మీడియాని ఇగ్నోర్ చేసిన వారు దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆర్యన్ ఖాన్ చేసిన పనికి తెగ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు . ఈయన ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ ఈయన మాత్రం బాగా ఫేమస్ అయ్యారు. తాజాగా ఈయన ఓ కార్యక్రమంలో భాగంగా బయటకు వచ్చారు. అయితే మీడియా వాళ్ళు తనని ఒక్క ఫోటో అని అడిగినప్పటికీ తను మాత్రం మీడియాని ఏమాత్రం పట్టించుకోకుండా కొంత యాటిట్యూడ్ చూపించారు. కారు ఎక్కి వెళ్తుండగా.. ‘ఆర్యన్ సార్ మీరు మమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు’ అని విలేఖరి అంటే యాటిట్యూడ్ చూపిస్తూ.. కారు ఎక్కి.. కాలు పైకి ఎత్తి.. ‘ఇది నేను’ అన్నట్టు ఒక వింత ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.
ఈ వీడియో చూసి సోషల్ మీడియాలోని నెటిజన్స్ ఆర్యన్ ఖాన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంత యాటిట్యూడ్ పనికిరాదబ్బా.. మీ నాన్నని చూసి నేర్చుకో.. ఆయన పరువు తీయకు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్యన్ తండ్రి షారూఖ్ ఖాన్ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు అని కొందరు చెప్పుకొస్తున్నారు. కాగా షారూఖ్ ఖాన్ రీసెంట్‌గా ‘పఠాన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించారు.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…