సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యిన ఉర్ఫీ… షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి బీబీ ఓటీటీకంటెస్టెంట్ . హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపిస్తూ ఉంటాయి. ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించుకుంది ఉర్ఫీ.
‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా పలు పాత్రలతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.సినిమాలు, షోస్ కన్నా ఆమె డ్రెస్‌లతోనే బాగా పాపులర్ అయింది. ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురవుతాయి. ఆమె దుస్తుల విషయంలో నెటిజన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తుంటారు , అయినప్పటికీ బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.
తాజాగా ఆమె మరో కొత్త అవతారంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది ఉర్ఫీ. డెనిమ్ జీన్స్ ఫ్యాంట్ ను టాప్‌గా ధరించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. తన జీన్స్‌కి క్రియేటివ్ టచ్ ఇచ్చి.. దాన్ని టాప్‌గా మలచి అందరు అవాక్కయ్యేలా చేసింది. ఆ డ్రెస్‌తొ జూహులోని ఓ రెస్టారెంట్‌కు రావడంతో.. కెమెరాలకు పని చెప్పినట్లయింది. ప్రస్తుతం ఉర్ఫీ జావెద్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఉర్ఫీ ఇటీవల తనకు ఎవ్వరూ ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.ముస్లీం గృహ యజమానులు తన వస్త్రధారణ చూసి ఇల్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారని, ఇదే సమయంలో హిందూ ఓనర్లు తన మతాన్ని చూసి కిరాయికి ఇల్లు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…