Animal Telugu Collections : బ్రేక్ ఈవెన్ సాధించిన యానిమ‌ల్‌.. ఎంత లాభం రాబట్టిందంటే..!

December 4, 2023 9:03 PM

Animal Telugu Collections : బాలీవుడ్‌లో తెరకెక్కే ఎన్నో సినిమాలకు సైతం దేశ వ్యాప్తంగా హైప్ ల‌భిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో చాలా చిత్రాలు టాలీవుడ్‌పైన కూడా ప్రభావాన్ని చూపించ‌గా, తెలుగు డైరెక్టర్ తెరకెక్కించిన ‘యానిమల్’ కూడా గత వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజ‌యం సాధించింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమ‌ల్‌ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో కనిపించారు.

డిసెంబ‌ర్ 1న విడుద‌లైన యానిమ‌ల్ చిత్రం మూడు రోజుల క్రితం విడుదలై మొదటి రోజు కన్నామిగతా రెండు రోజులు ఎక్కువ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.నిర్మాతల లెక్కల ప్రకారం యానిమల్ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 356కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో దేశ వ్యాప్తంగా 200కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవ‌రాల్‌గా తెలుగు వెర్ష‌న్ 25 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో యానిమ‌ల్ చిత్రం మూడు రోజుల్లో 35 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, 19 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాను దాదాపు 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేయ‌గా, ఆయ‌నకు. మూడు రోజుల్లో ఐదు కోట్ల వ‌ర‌కు లాభాలు వ‌చ్చాయి.

Animal Telugu Collections know how much it got
Animal Telugu Collections

యానిమ‌ల్ చిత్రం ఇదే జోరు కొన‌సాగిస్తే ఈ మూవీ ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. తండ్రి కొడుకుల కథ తో తెరకెక్కిన ఈసినిమాలో రష్మిక మందన్న కథానాయకిగా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.అర్జున్ రెడ్డి తో మేకింగ్ విషయంలో తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి ఈయానిమల్ ను మరింత బోల్డ్ గా తీసి సెన్సేషన్ సృష్టించాడు. అర్జున్ రెడ్డిని మించిన బోల్డ్ సీన్స్ ఇందులో ఉండ‌గా, ఈ సినిమా యూత్‌కి మంచి కిక్ ఇచ్చింది. కాని ఫ్యామిలీ ఆడియ‌న్స్ మాత్రం కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now