Animal Movie Talk : యానిమ‌ల్ సినిమా చూసి నా కూతురు చాలా ఏడ్చింది.. రాజ్య‌స‌భ‌లో పుష్ప‌.. యానిమ‌ల్‌పై విమ‌ర్శ‌లు..

December 9, 2023 9:52 PM

Animal Movie Talk : కొన్ని చిత్రాలు స‌మాజంపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయ‌ని, వాటిని బ్యాన్ చేయాల‌ని కొంద‌రు ఎప్ప‌టి నుండో యుద్ధం చేస్తూనే ఉన్నారు. పుష్ప సినిమా స‌మ‌యంలోనే ఆ సినిమాని కొంద‌రు ప్ర‌ముఖులు చాలా విమర్శ‌లు చేశారు. ఇక ఇప్పుడు యానిమ‌ల్ పై కూడా అదే టైపు విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. తాజాగా ఛత్తీస్ గడ్ కు చెందిన ఎంపీ రంజిత్ రంజన్ రాజ్య సభ్యలో పుష్ప, యానిమల్, కబీర్ సింగ్ సినిమాల గురించి పలు అంశాలు లేవనెత్తారు.ఇవి ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి.యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ చెప్పుకొచ్చారు.

సినిమా అనేది స‌మాజానికి అద్దం మాదిరిగా ఉంటుంది, దానిని చూస్తూ మ‌నం పెరిగాం. ఇది యువ‌త‌ని చాలా ప్రేరేపిస్తుంది. గ‌తంలో వ‌చ్చిన కబీర్ సింగ్, పుష్పలాంటి సినిమాలు ,ఇప్పుడు యానిమల్ సినిమాలు యువ‌త‌పై చాలా ప్ర‌భావం చూపిస్తాయి. రీసెంట్‌గా నా కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి యానిమ‌ల్‌ సినిమా చూడటానికి వెళ్లింది. మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది” అని రాజ్యసభలో ఆమె చెప్పారు. మహిళల పట్ల హింసను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందని ఆమె విమర్శించారు. “కబీర్ సింగ్ సినిమాలో ఉన్న వ్య‌క్తి తన భార్య, చుట్టు పక్కల మనుషులు, సమాజం పట్ల ఎలా వ్యవహరిస్తాడో చూసాం. దానిని యువ‌త ఆద‌ర్శ‌గా తీసుకుంది. ఇలాంటి సినిమా వ‌ల‌న స‌మాజంలో హింస పెరిగిపోతుంద‌ని రంజీత్ రంజన్ అన్నారు.

Animal Movie Talk discussed in rajya sabha
Animal Movie Talk

యానిమల్ మూవీలో సిక్కుల యుద్ధ గీతం అర్జన్ వైలీని ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ ఆమె ప్ర‌శ్నించారు. మొఘల్స్, బ్రిటీష్ తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను తెలిపే ఈ పాటను ఓ గ్యాంగ్ వార్ కోసం వాడుకోవడం వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఎంపీ కామెంట్స్‌ని కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. సమాజంలో జరిగే చాలా విషయాలకు సినిమాలకు లింకులు పెడుతూ ఫిలిం మేకర్స్ ని బాధ్యులను చేయడం సరికాదని , మంచి చిత్రాలు తీసినప్పుడు ప్రోత్సహించే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అడిగితే ఠక్కున సమాధానం రాదు అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now