Animal Movie OTT : యానిమ‌ల్ ఓటీటీ డిజిట‌ల్ రైట్స్ ఎవ‌రికి ద‌క్కాయి.. ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్ అంటే..!

December 1, 2023 5:41 PM

Animal Movie OTT : గ‌త కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా యానిమ‌ల్ మూవీ గురించి తెగ చ‌ర్చ న‌డుస్తుంది. ఈ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించారు. మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. డిసెంబ‌ర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ చిత్రం. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఇప్పుడు బ‌యట‌కు వ‌చ్చింది. ఈ సినిమా ఓటీటీ పార్టనర్ గా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఫిక్స్ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌లో యానిమ‌ల్ మూవీ కొన్ని నెల‌ల త‌ర్వాత స్ట్రీమింగ్ కానుండ‌గా థియేటర్ వర్షన్ కాకుండా ఓటీటీలో డిఫరెంట్ వర్షన్ రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానుంద‌ని స‌మాచారం .జనవరి 26 నుంచి నెట్‌ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా థియేటర్ వర్షన్ కాకుండా ఓటీటీలో మరింత రన్ టైం తో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే యానిమల్ హిందీ రైట్స్ ను సోనీ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది.

Animal Movie OTT know which platform have rights
Animal Movie OTT

యానిమ‌ల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది. తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ తో శుక్ర‌వారం ఈ యాక్ష‌న్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేసింది. యానిమ‌ల్‌ పై ఉన్న హైప్ కార‌ణంగా ఈ మూవీ ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. తొలిరోజు తెలుగులో మానిమ‌ల్‌ ఐదు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబట్టనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను దిల్‌రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now