Animal 15 days Collections : యానిమ‌ల్ అరాచ‌కం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది అంటే..!

December 18, 2023 10:18 PM

Animal 15 days Collections : రణ్‌బీర్ క‌పూర్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన చిత్రం యానిమ‌ల్. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న, రణ్‌బీర్ కపూర్, తృప్తి డిమ్రీ, అనిల్ కపూర్ నటించిన చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పటికీ.. ఇంతటి ఘన విజయాన్ని ఎవరూ ఊహించలేదు. ట్రేడ్ వర్గాల అంచనాలను పటాఫంచలు చేస్తూ ఈ సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.797.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దీంతో రూ.800కోట్ల కలెక్షన్ల మైలురాయికి యానిమల్ అత్యంత చేరువలోకి వచ్చింది. చూస్తుంటే ఈ చిత్రం త్వ‌ర‌లో వెయ్యి కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇండియాలోనే యానిమల్ చిత్రానికి 15 రోజుల్లో రూ.485.14 కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, దేశీయంగా రూ.500కోట్ల మార్కుకు కూడా దగ్గరైంది. మరో రెండు రోజుల్లో ఇండియాలో రూ.500కోట్లను దాటే అవకాశాలు ఉన్నాయి. చిత్రంలో ఉండే హింస‌తో పాటు బోల్డ్ సీన్లు హద్దులు దాటాయనే విమర్శలు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఈ సినిమా మాత్రం క‌లెక్ష‌న్స్ భారీగా రాబ‌డుతుండ‌డం విశేషం. యానిమ‌ల్ మూవీ మొదటి రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 54.75 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.2వ‌ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 58.37 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 63.43 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

Animal 15 days Collections know how much it earned
Animal 15 days Collections

4 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 40.06 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 34.02 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు 27.80 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.7 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 22.35 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.8 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 21.56 నేట్ కోట్ల కలెక్షన్స్, 9 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 32.47 నేట్ కోట్ల కలెక్షన్స్, 10 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 33.53 నేట్ కోట్ల కలెక్షన్స్, 11 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13.12 నేట్ కోట్ల కలెక్షన్స్, 12 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 నేట్ కోట్ల కలెక్షన్స్, 13 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9.75 నేట్ కోట్ల కలెక్షన్స్, 14 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 8.30 నేట్ కోట్ల కలెక్షన్స్, 15 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 7.85 నేట్ కోట్ల కలెక్షన్ లని రాబ‌ట్టింది యానిమ‌ల్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now