అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ.. ‘శ్రీమతి లతా రెడ్డి’ టైటిల్ ఫిక్స్? బ్రహ్మానందం మీమ్‌తో డైరెక్టర్ అదిరిపోయే క్లారిటీ!

చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.

February 12, 2026 9:51 AM
Director Anil Ravipudi clarifies on his next movie rumors after Mana Shankara Vara Prasad Garu hit.
తన తదుపరి సినిమాపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసిన అనిల్ రావిపూడి. Photo Credit: Anil Ravipudi/X.

చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, ఆయన గత హిట్ సంక్రాంతికి వ‌స్తున్నాం కలెక్షన్లను కూడా అధిగమించింది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. నిర్మాత సాహు గార‌పాటి‌తో భారీ సహకారం ఉంటుందని అనిల్ రావిపూడి టీమ్ సంకేతాలు ఇవ్వడంతో సోషల్ మీడియా, కొంత మీడియా వర్గాలు ఊహాగానాలను ప్రచారం చేయడం ప్రారంభించాయి. కథ, టైటిల్, నేపథ్యం, నటీనటుల జాబితా వరకు వివిధ కథనాలు వెలువడ్డాయి.

మీమ్ షేర్ చేసిన అనిల్ రావిపూడి..

కొన్ని రిపోర్టులు ఈ చిత్రంలో వెంక‌టేష్‌, ఫ‌హాద్ ఫాసిల్‌, ఆషికా రంగ‌నాథ్‌, పూజా హెగ్డె, కీర్తి సురేష్ నటిస్తారని పేర్కొన్నాయి. అంతేకాకుండా శ్రీ‌మ‌తి ల‌తా రెడ్డి అనే టైటిల్‌తో రాయలసీమ నేపథ్యంగా సినిమా రూపొందనుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలకు తనదైన హాస్యశైలిలో స్పందించిన అనిల్ రావిపూడి, బ్రహ్మానందం మీమ్‌ను షేర్ చేస్తూ తాను ఇంకా కథ రాయడం కూడా ప్రారంభించలేదని స్పష్టం చేశారు. తాను పెన్ కూడా పట్టకముందే కథ, టైటిల్, నటీనటులు, బ్యాక్‌డ్రాప్ అన్నీ ఫిక్స్ చేశారని వార్తలు రావడం ఆసక్తికరమని చమత్కరించారు.

అభిమానులు, మీడియా ఓర్పు పాటించాలని కోరిన ఆయన, తన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment