Anchor Suma : టాలీవుడ్ ప్రేక్షకులకి సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్న సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ వీడియోలు ఇలా తనలోని టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక ట్రెండ్‌కి తగ్గట్టు సుమ ఫొటోషూట్స్ కూడా చేస్తూ అలరిస్తుంది. ఇటీవల సుమ సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తుంది. ఇక తన తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. ప్రస్తుతం తన కుమారుడి మూవీని తెగ ప్రమోట్ చేస్తూ బిజీ అయింది.
తాజాగా సుమ దీపావళి సందర్భంగా ప్రసారం కానున్న ఒక ఈవెంట్ లో సందడి చేసింది. సుమ తన తనయుడు రోషన్‌తో ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇక ఒకప్పటి నటి యాంకర్ అయిన శిల్పా చక్రవర్తి కూడా ఈవెంట్‌లో సందడి చేసింది..అయితే ఆ ఈవెంట్లో శిల్పా చక్రవర్తి యాంకర్ సుమ గురించి మాట్లాడుతూ.యాంకర్ సుమ చూడ్డానికి ఇప్పుడిలా సంతోషంగా కనిపిస్తుంది కానీ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అప్పట్లో ఎన్నో ఇబ్బందులు పడిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. సుమ కొన్ని సార్లు సినిమాకి సంబంధించిన ఈవెంట్లైనా లేదా ఇంకా వేరే ఏదైనా షోలు ముగించుకుని వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యేది.
అయితే ఇంటికి వెళ్లిన సమయంలో ఇంటి తలుపు కొట్టిన లోపల ఉన్నవారెవరు డోర్ తీయకపోవడంతో సుమ మెట్ల మీదే పడుకునేది. అలా పడుకోవడం నేను చాలాసార్లు చూశాను అంటూ యాంకర్ సుమ జీవితంలో ఉన్న విషాదకర సంఘటనని శిల్పా బయటపెట్టింది. శిల్పా మాటలకి సుమ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు రోషన్ తన తల్లి దగ్గరకు వచ్చి హత్తుకొని ఓదార్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ కాగా, సుమ పరిస్థితి తెలుసుకొని ఆమె అభిమానులు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు. కాగా, యాంకర్ సుమ కొడుకు బబుల్ గమ్ అనే సినిమా లో హీరోగా చేస్తున్నారు.ఇక సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ ఈవెంట్ కి వచ్చినట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…