Anchor Suma : రాజీవ్ క‌న‌కాల చేసిన ప‌నికి ఇంటి ముందు మెట్ల‌పై ప‌డుకున్న సుమ‌..!

November 11, 2023 4:10 PM

Anchor Suma : టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి సుమ గురించి ప్ర‌త్యేక‌ ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్న సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ వీడియోలు ఇలా త‌న‌లోని టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటుంది. ఇక ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు సుమ ఫొటోషూట్స్ కూడా చేస్తూ అల‌రిస్తుంది. ఇటీవ‌ల సుమ సోష‌ల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సంద‌డి చేస్తుంది. ఇక త‌న త‌న‌యుడు రోష‌న్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తుంది. ప్ర‌స్తుతం త‌న కుమారుడి మూవీని తెగ ప్ర‌మోట్ చేస్తూ బిజీ అయింది.

తాజాగా సుమ దీపావళి సంద‌ర్భంగా ప్ర‌సారం కానున్న‌ ఒక ఈవెంట్ లో సంద‌డి చేసింది. సుమ త‌న త‌న‌యుడు రోష‌న్‌తో ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. ఇక ఒకప్పటి నటి యాంకర్ అయిన శిల్పా చక్రవర్తి కూడా ఈవెంట్‌లో సంద‌డి చేసింది..అయితే ఆ ఈవెంట్లో శిల్పా చక్రవర్తి యాంకర్ సుమ గురించి మాట్లాడుతూ.యాంకర్ సుమ చూడ్డానికి ఇప్పుడిలా సంతోషంగా కనిపిస్తుంది కానీ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అప్పట్లో ఎన్నో ఇబ్బందులు పడిందని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. సుమ‌ కొన్ని సార్లు సినిమాకి సంబంధించిన ఈవెంట్లైనా లేదా ఇంకా వేరే ఏదైనా షోలు ముగించుకుని వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యేది.

Anchor Suma got emotional on stage what happened
Anchor Suma

అయితే ఇంటికి వెళ్లిన స‌మ‌యంలో ఇంటి త‌లుపు కొట్టిన లోప‌ల ఉన్న‌వారెవ‌రు డోర్ తీయ‌క‌పోవ‌డంతో సుమ మెట్ల మీదే పడుకునేది. అలా పడుకోవడం నేను చాలాసార్లు చూశాను అంటూ యాంకర్ సుమ జీవితంలో ఉన్న విషాద‌క‌ర సంఘ‌ట‌న‌ని శిల్పా బ‌య‌ట‌పెట్టింది. శిల్పా మాట‌ల‌కి సుమ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు రోష‌న్ త‌న త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి హ‌త్తుకొని ఓదార్చాడు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో వీడియో వైర‌ల్ కాగా, సుమ ప‌రిస్థితి తెలుసుకొని ఆమె అభిమానులు కూడా ఫుల్ ఎమోష‌న‌ల్ అవుతున్నారు. కాగా, యాంకర్ సుమ కొడుకు బబుల్ గ‌మ్ అనే సినిమా లో హీరోగా చేస్తున్నారు.ఇక సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ ఈవెంట్ కి వచ్చినట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now